టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కాంబినేషన్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వారిలో కొరటాల శివ, మహేష్ బాబు ల కాంబినేషన్ ఒకటి.  గతంలో వచ్చిన ‘శ్రీమంతుడు’సూపర్ హిట్ అయ్యింది.  ఊరి నుంచి మనం ఎంతో తీసుకున్నాం..అలాంటి ఊరి కోసం ఎంతో కొంత చేయాలి’ అన్న కాన్సెప్ట్ తో దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ చాలా మంచి సక్సెస్ అయ్యింది.  ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన రెండు సినిమాలు బారీ డిజాస్టర్ కి గురయ్యాయి. దాంతో మరోసారి కొరటాలనే నమ్ముకున్నాడు మహేష్.  దాంతో కొరటాల దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’సినిమాతో వచ్చాడు మహేష్ బాబు. 

అనుకున్నట్లుగానే ఈ సినిమా అంచనాలు మించి సక్సెస్ అయ్యింది.  ఏప్రిల్ 20 న భారీ ఎత్తున విడుదలైన భరత్ అనే నేను ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మైలురాయి ని అందుకుంది.   తాజాగా ఈ సినిమాపై కొత్త వివాదం నెలకొంది. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రానికి వివాదాలు చుట్టుముడుతున్నాయి .

ఇప్పటికే భరత్ అనే నేను చిత్ర కథ నాదే అంటూ ఓ వ్యక్తి రచయితల సంఘం ని ఆశ్రయించగా తాజాగా భరత్ అనే నేను చిత్రంలో ‘‘నవోదయం ” అనే పార్టీ ని యాజిటీజ్ గా పెట్టడమే కాకుండా ఆ పార్టీ అధినేతను విలన్ గా చిత్రీకరించారని గుంటూరు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేసాడు నవోదయం పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు.  నల్లకరాజు ఇచ్చిన ఫిర్యాదు ని స్వీకరించిన ఎస్పీ దర్యాప్తు చేస్తామని తెలిపారు .

గతంలో కూడా మహేష్ బాబు – కొరటాల శివ ల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం కు కూడా వివాదాలు చుట్టుముట్టాయి . మరి ఈ భరత్ అనే నేను చిత్రం ఆ వివాదాల నుండి ఎప్పుడు బయట పడుతుందో ! ఏప్రిల్ 20 న భారీ ఎత్తున విడుదలైన భరత్ అనే నేను ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మైలురాయి ని అందుకుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: