స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా మారిన ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగా తన ప్రతి సినిమా రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి. ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి సినిమా గురించి ఎప్పుడూ మాట్లాడుకునేలా చేశాడు జక్కన్న. 


ఇక ఆ సినిమా తర్వాత మెగా నందమూరి మల్టీస్టారర్ కు షురూ చేశాడు రాజమౌళి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కథ ఇదంటూ రోజుకో స్టోరీ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా పునర్జన్మల కాన్సెప్ట్ తో రాబోతుందని లేటెస్ట్ న్యూస్. 


రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన మగధీరా పునర్జన్మల కాన్సెప్ట్ తో వచ్చిందే. ఈగ సినిమా కూడా హీరో చనిపోయి ఈగగా పుడతాడు. అయితే మరోసారి ఈ పునర్జన్మల కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడట రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ సినిమా కూడా ఈ కాన్సెప్ట్ తోనే వస్తుందట. 


నిన్నటిదాకా ఇదో అన్నదమ్ముల కథ అని వార్తలు రాగా ఇప్పుడు పునర్జన్మ అంటూ న్యూస్ లు కొత్తగా ప్రచారంలోకి వస్తున్నాయి. మరి అసలు కథ ఏంటన్నది మాత్రం చిత్రయూనిట్ చెబితే తప్ప తెలియదు. అక్టోబర్ లో మొదలవనున్న ఈ మల్టీస్టారర్ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో రాబోతుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: