ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కొంత మంది అప్ కమింగ్ హీరోయిన్లు చేసిన సినిమాలు తక్కువే అయినా అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం లభిస్తుంది.  ఈ కోవలోకి వస్తుంది సొగసైన చిన్నది  మేఘా ఆకాశ్.  ఈ అమ్మడు తెలుగు లో నటించిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు.  ఆ మద్య నితిన్ తో కలిసి ‘లై’ ఆ తర్వాత ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాల్లో నటించింది. 
Image result for megha akash
విచిత్రం ఏంటంటే..ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.  దాంతో  మేఘా ఆకాశ్ కెరీర్ ముగిసిపోయిందని అందరూ అన్నారు.  కానీ ఈ అమ్మడికి అదృష్టం తలుపు తట్టింది..ఏకంగా రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనేది తాజా సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ఒక సినిమా చేయనున్నాడు.
Image result for rajinikanth
ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. మరో ముఖ్యమైన పాత్ర కోసం బాబీ సింహాను తీసుకున్నారు.  కాకపోతే మేఘా ఆకాశ్ ఎవరి సరసన నటిస్తుందో తెలియదు కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఓ బ్రాండ్ ఉంటుంది కనుక ఆ సినిమా గనక హిట్ అయితే మేఘ ఆకాశ్ కెరీర్ మరో మలుపు తిరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. కాకపోతే ఈ విషయం మాత్రం అధికారికంగా చిత్ర యూనిట్ తెలుపలేదు.  త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: