రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో 90ల్లో వచ్చిన శివ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే మళ్ళీ దాదాపు రెండు దశాబ్దాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లోఇంకో చిత్రం  వస్తున్నదని ప్రకటించగానే ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు ఎక్కువయ్యాయి. తీరా విడుదలయ్యాక ఆఫీసర్ చిత్రం భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.


ఆంధ్రా, నైజాం, సీడెడ్ వంటి ప్రాంతాలతో సంబంధం లేకుండా దాదాపు అన్ని ఏరియాలలో కలెక్షన్ల పరిస్థితి దారుణంగా ఉంది. వీటి మూడింటితో పోలిస్తే నైజాం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నైజాంలో  చాలా మటుకు ఏరియాలలో ఆఫీసర్ కు థియేటర్ లు కూడా లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నాగర్జున లాంటి అగ్రహీరో కు  రాష్ట్రం మొత్తం మీద కేవలం 350 థియేటర్లు దక్కాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 


ఇక నాగర్జున అభిమానులైతే ఆఫీసర్ సినిమా పట్ల తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. శివ సినిమా తరువాత దాదాపు 20 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రానుండడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా డిజాస్టరు అవడంతో వర్మ కు విన్నూత పద్దతిలో నిరసనను తెలియజేశారు. ఇక నీ సినిమాలకు ఒక దండం అని తెలియజేసేలా ఆయన కటౌట్ కి కొందరు నాగర్జున అభిమానులు పాలాభిషేకం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వర్మ దీని పట్ల ఎలా రియాక్ట్ అవుతాడో.


మరింత సమాచారం తెలుసుకోండి: