‘నాపేరు సూర్య’ పరాజయం తరువాత అయోమయంలోకి వెళ్ళిపోయిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా కథ విషయంలో తీవ్ర అయోమయంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ ఎవరు అందుబాటులో లేని నేపధ్యంలో బన్నీ ఎవ్వరో ఒక యంగ్ డైరెక్టర్ ను నమ్ముకోవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి. 

ఇలాంటి పరిస్థుతులలో హడావిడిగా అల్లు అరవింద్ గీత ఆఫీసులో జరిగిన బోయపాటి అల్లుఅర్జున్ ల మీటింగ్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్నకోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బోయపాటి చరణ్ తో సినిమాను తీస్తూ బిజీగా ఉన్నాడు. ఈమూవీ తరువాత బోయపాటి బాలకృష్ణ మూవీకి కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 
Allu Arjun Shares Why Success Of ‘Sarrainodu’ Is Special To Him
దీనితో బోయపాటి బన్నీల మూవీకి అవకాశం ఎక్కడ ఉంది అన్నవార్తలు హడావిడి చేస్తున్నాయి. అయితే కొందరు మాత్రం బోయపాటి బాలయ్యల మూవీ అధికారికంగా అనౌన్స్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ బోయపాటి బన్నీ వైపు యూటర్న్ తీసుకుంటాడా అన్న సందేహాలు కూడ వ్యక్త పరుస్తున్నారు. అల్లు అర్జున్ తో సినిమా చేయాలని సంపత్ నంది హరీష్ శంకర్ లు అల్లు కాంపౌండ్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇప్పుడు మధ్యలో బోయపాటి బన్నీ ట్విస్ట్ ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారు. 
Allu-Arjun
ఇది ఇలా ఉండగా వంశీ పైడిపల్లి టాప్ దర్శకులకు రెండు రోజుల క్రితం ఇచ్చిన డిన్నర్ పై అల్లు అర్జున్ వెరైటీగా స్పందించాడు. పెద్ద డైరెక్టర్స్ అందర్నీ ఒక ఫ్రేంలో చూడటం సంతోషంగా ఉంది అని అంటూ ఈ డిన్నర్ కు టాప్ దర్శకులు అంతా వచ్చి తమ ఐక్యత చాటుకున్నారు అంటూ కామెంట్ చేసాడు. ఈ కామెంట్స్ చూసిన కొంతమంది ప్రస్తుతం తాను ఖాళీగా ఉన్నాను అంటూ అల్లు అర్జున్ టాప్ డైరెక్టర్స్ కు గుర్తుకు చేస్తున్నాడా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: