తేజ మొదలుపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. నా వల్ల కాదు బాబోయ్ అంటూ తేజ చేతులెత్తేశాడు. అయితే తేజ బయటకు వచ్చాక ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు క్రిష్ చేతుల్లోకి వెళ్లింది. క్రిష్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ రాబోతుంది. ఈ సినిమాను ఎన్.బి.కే ఆర్ట్స్ బ్యానర్ లో బాలకృష్ణ నిర్మిస్తున్నారు.


బాలకృష్ణ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో దాదాపు 53 గెటప్పులలో కనిపిస్తారట. ఇక ఈ సినిమా క్రిష్ చేతుల్లో పడేసరికి నందమూరి ఫ్యాన్స్ లో కూడా కొత్త జోష్ వచ్చింది. గమ్యం నుండి శాతకర్ణి వరకు క్రిష్ తన ప్రతి సినిమాతో ప్రతిభ చూపిస్తున్నాడు. బాలయ్య 100వ సినిమాగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా అద్భుతంగా తీశాడు. 


ఇక ఇప్పుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ ను అదే రేంజ్ లో తీస్తున్నారట. ఈ సినిమా కోసం కాస్టింగ్ కాల్ ఆఫర్ చేశారు. సినిమాలో ముఖ్య పాత్రలకు కొందరిని ఇప్పటికే సెలెక్ట్ చేయగా ఇంకా కొందరు కావాల్సి ఉన్నారట. దానికోసం ఆడిషన్ ఏర్పాటు చేస్తున్నారు. కొత్తవారికి ఈ సినిమాలో అవకాశం ఇస్తున్నారట.


అలాంటి పెద్ద సినిమాలో అవకాశం అంటే చాలా గొప్ప విషయమని చెప్పాలి. నటన మీద ఆసక్తి ఉండి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎన్.బి.కే ఆర్ట్స్ గొప్ప అవకాశం ఇస్తుంది. మరి ఈ కాస్టింగ్ కాల్ డీటైల్స్ ఏంటో వారు ఇచ్చిన ప్రకటనలో ఉన్నాయి. మరి ఎందుకు ఆలస్యం మీరు ఓ ప్రయత్నం చేయండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: