నందమూరి సింహం బాలకృష్ణ నటించిన సినిమాలలో ‘లక్ష్మీనరసింహ’  ఒక ట్రెండ్ సెటర్. ఈమూవీలో పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించిన బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ అప్పట్లో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. తమిళ హీరో విక్రమ్ నటించిన ‘సామి’ రీమేక్ గా విడుదలైన ఈమూవీ అప్పట్లో తెలుగు తమిళ భాషలలో కూడ ఘన విజయాన్ని అందుకుంది.

కోలీవుడ్ హీరో విక్రమ్ కు మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘సామి’ సినిమాకు ఇప్పుడు తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ‘సామి స్క్వేర్’ తో ప్రస్తుతం తమిళంలో తీయబడుతున్న ఈమూవీకి ‘సింగం’ సిరీస్ సినిమాలతో మెప్పించిన దర్శకుడు హరి ‘సామి స్క్వేర్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 
Vikram and Bobby Simha will be seen sharing screenspace in Saamy Square.
భారీ అంచనాలతో రూపొందుతున్న ఈమూవీ పై విక్రమ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈమూవీ విడుదల కాకుండానే ఈమూవీకి భారీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ రీమేక్ పై బాలకృష్ణకు ఆశ కలిగినట్లు తెలుస్తోంది. దీనితో బాలయ్యతో సన్నిహితంగా ఉండే ఒక దర్శకుడు చేత విక్రమ్ ను ‘సామి స్క్వేర్’ రీమేక్ గురించి అడిగించినట్లు సమాచారం. 
Nandamuri Balakrishna Latest Stills..
అయితే ఈ రాయబారానికి ఆసక్తికనపరచని విక్రమ్ తన ‘సామి స్క్వేర్’ ను డబ్ చేసి డైరెక్ట్ గా తెలుగులో విడుదల చేసే ఉద్దేశ్యం ఉన్నట్లు చెపుతూ బాలయ్య ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు టాక్. ‘అపరిచితుడు’ సినిమా తరువాత తెలుగులో సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న విక్రమ్ తన ‘సామి స్క్వేర్’ తో టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడుతుంది అని భావిస్తున్నట్లు టాక్. ఏమైనా బాలయ్య కోరికను విక్రమ్ తిరస్కరించడం షాకింగ్ గా మారింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: