సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అశ్వనిదత్, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్యాక్షన్ కథతో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడని తెలిసిందే. 


ఇక ఇప్పుడు ఆ లుక్ లీక్ అయ్యింది. మహేష్ గడ్డం లుక్ లో ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. ఈ సినిమా లుక్ విషయంలో మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మంచి కథలతో సినిమాలు చేస్తున్నా లుక్ విషయంలో మాత్రం మహేష్ రెగ్యులర్ గానే కనిపిస్తున్నాడు. అందుకే వంశీ పైడిపల్లి సినిమాకు కొత్త లుక్ ట్రై చేస్తున్నాడట.


మేకోవర్ చేసే క్రమంలో మహేష్ గడ్డం లుక్ తో కనిపిస్తున్నాడు. ఎయిర్ పోర్ట్ లో మహేష్ కనిపించే సరికి కెమెరాలు క్లిక్ మనిపించారు. మహేష్ గడ్డం లుక్ తో అడ్డంగా బుక్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ సినిమాకు టైటిల్ గా రాజసం, రైతుబిడ్డ అంటూ చెబుతున్నారు. సినిమాలో అల్లరి నరేష్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడట.


భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. సినిమా లుక్ విషయంలో మహేష్ ఎన్ని జాగ్రత్తలు పడ్డా చివరకు ఇలా లీక్ అవడం మహేష్ షాక్ అయ్యాడని తెలుస్తుంది. అయితే లీకైన పిక్స్ లో మహేష్ గడ్డం కనిపిస్తుంది కాని పైన క్యాప్ ఉండటం వల్ల క్లియర్ గా లేదు. మరి అఫిషియల్ లుక్ ఎలా ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: