ఈ మద్య ఐటీ కంపెనీల్లో ఒక ట్రెండ్ కొనసాగుతుంది..ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు వస్తే..ఆ రోజు సెలవు ప్రకటించి ఉద్యోగులకు రిలీఫ్ ఇస్తుంది.  గతంలో పలు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన సందర్భంగా కొన్ని ఐటి కంపెనీలు సెలవు ప్రకటించాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది..ఈ సందర్బంగా ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ‘కాలా’ సినిమా చూడటానికి వీలుగా సెలవు ప్రకటించామని, దీన్ని పెయిడ్-లీవ్‌గా పరిగణించి ఆ రోజు జీతం కూడా చెల్లిస్తామని టెలూయిస్ టెక్నాలజీస్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జోసెఫ్ వెల్లడించారు.

kochi it company declares holiday for employees on june 7 on day of rajinikanth's film release

‘డియర్ టీమ్ మెంబర్స్, మీ అందరికీ ఒక శుభార్తను ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. సూపర్ స్టార్ రజినీకాంత్ గౌరవార్థం, మీ అందరి కోరిక మేరకు మన కంపెనీ జూన్ 7న సెలవుదినంగా ప్రకటించింది. రిలీజ్ రోజు నాడే ‘కాలా’ సినిమా చూడటానికి మీకు సదావకాశాన్ని ఇచ్చింది’ అంటూ సర్కిల్యర్‌లో పేర్కొన్నారు.  ‘ఆ గొప్ప వ్యక్తి (రజినీకాంత్) ప్రతి ఒక్కరం గౌరవించాలి. మా ఆఫీసులో మొత్తం 30 మంది ఉద్యోగులం ఉన్నాం. 

Related image

కొంత మంది టీమ్‌ సభ్యులు, మహిళా ఉద్యోగులు రజినీకాంత్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్స్’ అని జోసెఫ్ తెలిపారు.  ఉద్యోగుల ఆనందానికి అడ్డుపడటం మంచిది కాదనే ఉద్దేశంతోనే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందట. తమ సంస్థ ఆ రోజుని సెలవుదినంగా ప్రకటించిన మాట నిజమేనని అందులో పనిచేస్తోన్న వారు అన్నారు. తమ సంస్థ పబ్లిసిటీ కోసం ఇలా చేయలేదనీ, రజనీ సినిమా పట్ల ఉద్యోగుల్లో గల ఉత్సాహాన్ని గుర్తించే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: