వంశీ పైడిపల్లి తన నివాసం లో కొంత మంది డైరెక్టర్స్ కు భారీ విందు పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ విందు వెనుకల చాలా మతలబు ఉందని కొంతమంది ఆరోపిస్తున్నారు. అస్సలు ఆ కొంతమంది నే ఎందుకు పిలవాల్సిందని చర్చలు వినిపిస్తున్నాయి. అయితే విందుకు వచ్చిన వారిలో బడా డైరెక్టర్ రాజమౌళి నుంచి కొరటాల శివ, సుకుమార్ వంటి వారు ఉన్నారు. వారితో పాటు ఓ మోస్తారు డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అయితే మిగతా డైరెక్టర్స్ త్రివిక్రమ్. శ్రీను వైట్ల వారు కూడా పెద్ద డైరెక్టర్సే కానీ వారు మాత్రం కనిపించలేదు. 

Image result for vamsi paidipalli meeting

రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, వంద కోట్ల దర్శకులు. నాగ్ అశ్విన్, క్రిష్ మేధావి వర్గానికి చెందిన దర్శకులు అనుకోవచ్చు. వంశీ పైడిపల్లి మంచి దర్శకుడే కానీ ఇప్పటి వరకు నిర్మాతలకు లాభాలు అయితే ఇవ్వలేదు. ఊపిరి కూడా లాస్ ప్రాజెక్టే. నిర్మాత పివిపిని అడిగితే చెబుతారు. అనిల్ రావిపూడి మాస్ కమర్షియల్ డైరక్టర్. హరీష్ శంకర్ ప్రస్తుతం సినిమా కోసం వేచి వున్నారు. సందీప్ వంగా సెన్సేషనల్ డైరక్టర్.

Image result for vamsi paidipalli meeting

మరి వంశీ పైడిపల్లి వీరిని మాత్రమే ఎందుకు పిలిచారు? మిగిలిన చాలా మందిని ఎందుకు పిలవలేదు? టాప్ డైరక్టర్లు, తెలంగాణ ఈక్వేషన్, ఈ రెండు కలిపి వంశీ పైడిపల్లి ఈ డైరక్టర్ల గ్రూప్ ను తయారుచేసారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇండస్ట్రీలో ఇంకా మంచి దర్శకులు, పెద్ద దర్శకలు చాలా మంది వున్నారు. సందీప్ వంగా, హరీష్ శంకర్ రేంజ్ డైరక్టర్లు అయితే బోలెడు మంది వున్నారు. బోయపాటి, త్రివిక్రమ్, సురేంద్రరెడ్డి, శేఖర్ కమ్ముల, శ్రీను వైట్ల, బాబి, మారుతి ఇలా చాలా జాబితా వుంది. సినిమాలు చేతిలో వున్నవారు, హిట్ లు ఇచ్చిన వారు, కాస్త పేరున్నవారు. మరి వీరందరిని ఎందుకు దూరం పెట్టినట్లో?


మరింత సమాచారం తెలుసుకోండి: