సూపర్ స్టార్ రజినికాంత్.. తమిళనాడులో ఈ పేరు చెబితే అభిమానంతో జనాలు ఊగిపోతారు. ఆయన సినిమా హిట్ అయితే కాసుల వర్షమే.. అంతేకాదు రజిని హిట్ సినిమా ముందు బజ్జీల అమ్ముకుని లక్షాధికారులు అయిన వారున్నారని టాక్. ఇదంతా ఒకప్పుడు పరిస్థితి కాని ఇప్పుడు రోజులు మారాయి.


రజిని సినిమా అంటే వారం ముందు నుండే ఓ హడావిడి ఉండేది కాని కాలా పరిస్థితి వేరేలా ఉంది. కబాలి సినిమాకు వచ్చిన క్రేజ్ లో సగం కూడా ఈ సినిమాకు లేదన్నది వాస్తవం. అదే కాంబినేషన్ అవడం వల్ల తేడా కొట్టిందా లేక నిజంగానే రజినికి ఫాలోయింగ్ తగ్గిందా అన్నది తెలియాల్సి ఉంది.


ఇక రజిని సినిమాకు రాజకీయ సెగ తగిలిందని ఇన్నర్ టాక్. కర్ణాటకలో సినిమాకు ఆల్రెడీ అడ్డు పడుతుండగా తెలుగులో ఇదవరకు రజినికాంత్ సినిమాకు ఉండే హంగామా ఎక్కడ కనబడటం లేదు. రజిని పరిస్థితి ఇలా మారడానికి గల కారణాలు ఏంటన్నది మాత్రం ఎవరు ఊహించలేకపోతున్నారు.


స్వయాన రజిని వచ్చి కాలాను ప్రమోట్ చేసినా తెలుగులో కాలాకి ఏమాత్రం బజ్ ఏర్పడలేదు. ఇదంతా రజిని ఇదవరకు సినిమాలు ఇచ్చిన షాక్ అని తెలుస్తుంది. భారీ రేటుకి కొని అంతే భారీగా ప్రమోట్ చేసినా హిట్ అయితే ఓకే కాని ఫ్లాప్ అయితేనే రోడ్డున పడాల్సి వస్తుంది. అందుకే కాలా తెలుగు రైట్స్ కేవలం 30 కోట్లకు కొన్నారు. మరి ఈ కాలా అయినా రజినికి మళ్లీ మునుపటి క్రేజ్ తెస్తుందేమో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: