రజినీకాంత్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే తమిళనాడులో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈసారి రజినీ ‘కాలా’ కు చెప్పుకోతగ్గ ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ ముందుగా లేకపోవడంతో ఈమూవీ ఫలితం పై రజినీకాంత్ అభిమానులు కొంత నిరాశ పడ్డారు. అయితే ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి వస్తున్న ఓవర్సీస్ టాక్ రజినీకాంత్ అభిమానులకు జోష్ ను కలిగించే విధంగా ఉంది. 
రజనీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్
ఈసినిమాను చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు చెపుతున్న అభిప్రాయాల ప్రకారం ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ మసాలా ఫిల్మ్ ‘కాలా’ అని అంటున్నారు. అద్భుతమైన సందేశంతో రూపొందిన మాస్ ఎంటర్‌ టైనర్ గా ఈమూవీ అందరికీ నచ్చుతుందని ఓవర్సీస్ టాక్. ఇక రజనీకాంత్ పెర్ఫార్మెన్స్ టాప్ అని అంటూ ఈమూవీ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉండటమే కాకుండా ఈమూవీలో రజనీకాంత్ ఎంట్రీ సీన్ అదిరింది అంటూ ఓవర్సీస్ ప్రేక్షకులు ఈసినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
రజనీకాంత్‌కు అవార్డులు ఖాయం
ఈ మూవీలోని వర్షంలో ఫైట్ సీన్ హైలెట్ అని అంటూ దర్శకుడు రంజిత్ కథ కథనాలు ఈ సినిమాను టాప్ హిట్ రేంజ్ కి ఎలివేట్ చేస్తాయి అన్న అభిప్రాయాలు ఓవర్సీస్ టాక్ ద్వారా అందుతున్నాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈమూవీకి ప్లస్ పాయింట్ గా మారింది అని ఓవర్సీస్ ప్రేక్షకుల టాక్. ఈసినిమాలో మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు రజినీకాంత్ నట విశ్వరూపం కనిపిస్తుంది అంటూ ఓవర్సీస్ ప్రేక్షకులు రజినీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 కాలా చిత్రం పైసా వసూల్
ఇక మరికొందరైతే ఈ చిత్రంలో ఏఒక్క సన్నివేశం కూడా వృథా అనిపించదు అని అంటూ అవార్డులు అందుకునే స్థాయిలో రజనీకాంత్ నటన ఉంది అని ఓవర్సీస్ ప్రేక్షకుల అభిప్రాయం. ముఖ్యంగా నానా పాటేకర్ నటన నభూతో నభవిష్యత్ అని అంటూ ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ పరిధిలో చాల చక్కగా నటించారు అన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ‘కాలా’ స్పెషల్ షోలు ఈరోజు తెల్లవారుజామునుండే చెన్నైలో ప్రారంభం అయ్యాయి. ఈ ఓవర్సీస్ టాక్ స్థాయిలో చెన్నై ప్రేక్షకుల అభిప్రాయం కూడ జత కూడితే ‘కాలా’ ఊహించని ఘన విజయం సాధించే అవకాశం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: