సూపర్ స్టార్ రజిని, పా. రంజిత్ డైరక్షన్ లో వచ్చిన కాలా మూవీ ప్రీమియర్ షోస్ నుండి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మొదటి షో టాక్ బయటకు రాలేదు. దాదాపు సినిమాపై అందరు పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. కబాలి షాక్ తో ఈ సినిమాపై అంచనాలు పెట్టుకోలేదు ఆడియెన్స్.


అయితే కబాలిలా కాకుండా ఇందులో ఓ మంచి కథతో వచ్చాడు పా. రంజిత్. ఇక ఈ సినిమా ఎందుకు చూడాలి అని చెప్పేందుకు ఓ 5 రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే..


ఎవర గ్రీన్ సూపర్ స్టార్ రజినికాంత్ :


రజిని చూడాలంటే మొదటి రీజన్ రజినికాంతే.. ఆయన స్టైల్, లుక్, పర్ఫార్మెన్స్, డైలాగ్ ఇవన్ని ఆయన్ను ఆ స్థానంలో ఉంచాయి. కాలాలో బ్లాక్ అండ్ బ్లాక్ తో అదరగొట్టే లుక్ లో కనిపించారు రజినికాంత్.


సంతోష్ నారాయణన్ మ్యూజిక్ :


సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాలా రేంజ్ ను మరింత పెంచిందని అంటున్నారు. కబాలిలో లానే మ్యూజిక్ పరంగా సంతోష్ కోసమైన ఈ సినిమాకు వెళ్లొచ్చు.


రంజిత్, ధనుష్ ల కాంబినేషన్ :


రంజిత్ ఓ టాలెంటెడ్ డైరక్టర్ తను తీసిన పొలిటికల్ డ్రామా మద్రాస్ ఇంకా డాక్యుమెంటరీ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ బాగా పేరు తెచ్చాయి. కబాలి అంచనాలను అందుకోలేదు అయితే ఈసారి మాత్రం కాలా అద్భుతాలు సృషిస్తాడని తెలుస్తుంది. ఇక హీరోగానే కాదు అభిరుచి గల నిర్మాతగా కూడా ధనుష్ ప్రూవ్ చేసుకున్నాడు. నిర్మాతగా 3, పా పండి, నాన్ రౌడీ థాన్ సినిమాలు హిట్లు కొట్టాడు. ధనుష్ నిర్మాతగా ఈ సినిమాకు అదనపు క్రేజ్ సంపాదించింది.


స్టోరీ : 


ధారావి ప్రాంత ప్రజల కష్టాలను తీర్చే నాయకుడిగా కాలా కనిపిస్తాడు. ఈ సినిమా పొలిటికల్ సెటైర్ గా కూడా చెప్పుకోవచ్చు. సినిమా కథ రజిని ఇమేజ్ కు తగినట్టుగా ఉంది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ముఖ్యంగా రజిని పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న ఈ తరుణంలో ఈ సినిమా చేయడం విశేషం.


కాస్ట్ అండ్ క్రూ :


రజినితో పాటుగా ఈ సినిమాలో విలన్ గా నానా పటేకర్ చేశాడు. ఆ సినిమా ఒప్పుకున్నాడు అంటేనే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఈశ్వరి రావు, హ్యూమా ఖురేషితో పాటుగా సముద్రఖని ఈ సినిమాలో నటించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: