తెలుగు ఇండస్ట్రీలో ‘శివ’లాంటి సెన్సషన్ చిత్రం తీసిన రాంగోపాల్ వర్మ వద్ద ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేశారు. అందులో ఒకరు కృష్ణ వంశి. దర్శకుడిగా ‘గులాబి’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న కృష్ణ వంశి ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు.  గులాబీ చిత్రంలోని పాటల చిత్రీకరణ చూసి, అతనికి అక్కినేని నాగార్జున రెండవ చిత్రానికి అవకాశం ఇచ్చాడు.
Image result for krishna vamsi ramya
ఆ సినిమా పేరు నిన్నే పెళ్ళాడుతా. తరువాత స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి 'ఆంధ్రా టాకీస్' సంస్థను ప్రారంభించాడు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి చిత్రీకరంచిన సింధూరం చిత్రాన్ని తెరకెక్కించారు కృష్ణవంశి.  ఇన్ని సూపర్ హిట్ ఇచ్చిన కృష్ణ వంశికి గత కొంత కాలంగా బ్యాడ్ టైమ్ మొదలైందనే చెప్పాలి.

2009లో మహాత్మ తర్వాత పైసా, మొగుడు, గోవిందుడు అంరదివాడే. నక్షత్రం వంటి సినిమాలు డిజాస్టర్‌గా మిగిలాయి.. కాగా కొత్త సినిమా కూడ ప్రకటించలేదు. కాకపోతే ఈ గ్యాప్ లో మాత్రం కొత్త సినిమా స్క్రిప్టు సిద్ధం చేసుకున్నట్టు  తెలుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో ఇటీవల వచ్చిన 'రంగస్థలం  సినిమా పల్లె వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించి, అనూహ్యమైన విజయాన్ని అందుకుంది.

కృష్ణవంశీ సినిమాల్లో సహజంగానే తెలుగుదనం కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. కథను బట్టే ఆయన నటీనటులను ఎంపిక చేసుకుంటూ వుంటారు. అలా గ్రామీణ వాతావరణంలో ఆయన తెరకెక్కించిన 'చందమామ' ఒక దృశ్యకావ్యమనే అనిపించుకుంది. త్వరలో తాను కూడా  గ్రామీణ నేపథ్యంతో కూడిన ఒక కథను సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: