బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఎన్.టి.ఆర్, రాం చరణ్ మల్టీస్టారర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ట్రిపుల్ ఆర్ అంటూ ట్రెండ్ సృష్టించిన జక్కన్న సినిమా కథను ఓ బాలీవుడ్ సినిమాకు స్పూర్తిగా తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కరణ్ అర్జున్ సినిమా రీమేక్ గా ఈ సినిమా వస్తుందని అన్నారు.


సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా 1995లో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది. ఇక ఆ సినిమా కథనే మార్చి మెగా నందమూరి మల్టీస్టారర్ గా చేస్తున్నాడని అంటున్నారు. దీనిపై నిర్మాత డివివి దానయ్య వివరణ ఇచ్చారు. ఈ సినిమా కథ గురించి మీడియాలో వస్తున్న వార్తలన్ని అబద్ధమని చెప్పారు. 


నెల రోజుల్లో సినిమాపై ఓ క్లారిటీ ఇస్తామని.. చరణ్, ఎన్.టి.ఆర్ తప్ప సినిమా కాస్ట్ అండ్ క్రూని ఎవరిని సెలెక్ట్ చేయలేదని చెప్పాడు దానయ్య. లేటెస్ట్ గా మహేష్ భరత్ అనే నేను సినిమాతో హిట్ అందుకున్న దానయ్య ఈ మల్టీస్టారర్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.


రజమౌళి, రాం చరణ్, రామారావు ఇలా ట్రిపుల్ ఆర్ అని మొదటి ఎనౌన్స్ మెంటే అదిరిపొయేలా ఇచ్చిన జక్కన్న. ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాగా తెరకెక్కించాలని చూస్తున్నారట. విజయేంద్ర ప్రసాద్ కథ ఇప్పటికే సిద్ధం చేయగా ఒరిజినల్ లైన్ మాత్రం బయటకు రానివ్వట్లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: