తెలుగు  ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రవితేజ తర్వాత చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలు పెట్టారు.  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇడియట్’ సినిమాతో హీరోగా మారారు.   మాస్ మహరాజా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న  రవితేజ ‘పవర్’ సినిమా తర్వాత వరుసగా ఫ్లాపులు చవిచూశారు.  కిక్ 2, బెంగాల్ టైగర్ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు.  గత సంవత్సరం ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మరోసారి తానేంటో చూపించాడు. 

Image result for raviteja nela ticket

ఇక రవితేజ సక్సెస్ బాట  ‘టచ్ చేసి చూడు’,‘నేల టిక్కెట్టు’ ఫ్లాప్ కావడంతో మనోడి కెరీర్ మళ్లీ కాంట్రవర్సీలో పడిపోయింది.  అయితే రవితేజకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ సైడ్ కూడా మంచి క్రేజ్ ఉంది. రవితేజ నటించిన ప్రతి సినిమా డబ్బింగ్ అయి హిందీ టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ అయింది. యూట్యూబ్ లోనూ అతడి సినిమాలు ఇష్టంగా చూసేవాళ్లు చాలామందే ఉండేవారు. 

Image result for ravi teja raja the great

వాస్తవానికి నేలటిక్కెట్టు అయితే డిజాస్టర్ గా మిగిలిపోయింది. కానీ ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కు దాదాపు రూ. 10 కోట్ల దాకా వచ్చాయని తెలిసింది. సినిమా శాటిలైట్ రైట్లకన్నా ఈ మొత్తమే ఎక్కువ.  అయితే  ఈ మధ్య మాస్ మహారాజా సినిమాలన్నీ వరసగా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడుతున్నాయి. 


రవితేజత తరవాత తమిళ మూవీ తెరి రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ డబ్బింగ్ రైట్స్ రూ. 6 కోట్లు మాత్రమే పలికాయి. ముందు సినిమాకు పలికిన అమౌంట్ తో పోలిస్తే చాలా తక్కువ రేట్ పలికిందనే చెప్పాలి. అంటే రవితేజ నేల టిక్కెట్ తరువాత మార్కెట్ ఎలా పడిపోయింది ఇది చూస్తే మనకు అర్ధం అవుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: