తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో సుమన్ అంటే ఒకప్పుడు శోభన్ బాబు తర్వాత అందగాడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.  యాక్షన్ తరహా చిత్రాల్లో నటించిన ఆయన తర్వాత కుటుంబ నేపథ్యంలో ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటించారు.  జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించిన సుమన్.. 1977లో టి.ఆర్.రామన్న నిర్మించిన తమిళ సినిమా నీచల్ కులంతో సినీరంగంలో ప్రవేశించాడు.
Related image
తొలి సినిమాలో సుమన్ పోలీసు అధికారి పాత్ర పోషించాడు.  షోటోకన్ కరాటే సంస్థనుండి కరాటేలో బ్లాక్ బెల్ట్ 1 డాన్ సాధించిన సుమన్ ఆంధ్రప్రదేశ్ కరాటే సమాఖ్యకు అధ్యక్షుడు. హైదరాబాదులో స్థిరపడిన సుమన్ ప్రముఖ తెలుగు నాటక రచయిత డి.వి.నరసరాజు యొక్క మనుమరాలు శిరీషను వివాహము చేసుకొన్నాడు. సుమన్ నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 40 సంవత్సరాలను పూర్తిచేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ..నటుడిగా 40 సంవత్సరాలను పూర్తిచేసుకోవడం చాలా సంతోషంగా వుంది. తెలుగు .. తమిళ .. కన్నడ .. మలయాళ .. ఒరియా .. భోజ్ పురి భాషల్లో కలిపి ఇంతవరకూ 400 సినిమాలు చేశాను.  రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వస్వామి పాత్ర, ఇదే కాంబినేషన్ లో వచ్చిన శ్రీరామదాసు చిత్రంలో శ్రీరాముడిగా నటించి మెప్పించారు.
Image result for suman sivaji movie
 'శివాజీ'లో విలన్ పాత్రను ఎప్పటికీ మరిచిపోలేను. గాడ్ ఫాదర్ లేకుండగా ఈ స్థాయి చేరుకోవడం నాకు ఎంతో గర్వంగా వుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు .. అభిమానుల ఆదరణ కారణంగా ఇన్ని సంవత్సరాలు పరిశ్రమలో ఉండగలిగాను. మరో పదేళ్లపాటు పరిశ్రమలో ఉండాలనీ .. 500 సినిమాలు పూర్తిచేయాలని వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: