ఈ మద్య స్టార్ హీరో, హీరోయిన్ల చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పై ఔత్సాహిక కళాకారులు తమదైన స్టైల్లో డ్యాన్స్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  అందులో కొన్ని సక్సెస్ కూడా అవుతున్నాయి.  ఆ మద్య రాంచరణ్ నటించిన ‘మగధీర’ చిత్రంలో కొన్ని డైలాగ్స్ తో అందరినీ ఆకర్షించాడు ఓ చిన్న కుర్రాడు.  ఆ కుర్రాడిని రాంచరణ్ ప్రత్యేక్ష కలిసి..డైలాగ్స్ విని ఎంతో సంతోషించాడు. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, స‌మంత‌లు న‌టించిన మూవీ ‘రంగస్థలం’ .

రంగమ్మ..మంగమ్మ పాటపై బుడ్డోడి డ్యాన్స్ కి ఫిదా అయిన సమంత!
ఈ సినిమాలో రంగ‌మ్మ‌, మంగ‌మ్మ‌ పాటకు సమంత, రామ్‌చరణ్‌ డ్యాన్స్‌ హైలైట్‌గా నిలిచింది. చాలా మంది నెటిజన్లు ఈ పాటకు పేరడీలు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  తాజాగా ఓ చిన్న కుర్రోడు స్కూల్ డ్రెస్ వేసుకొని ‘రంగమ్మ’ పాటకు డ్యాన్స్‌ చేసిన వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘ఈ వీడియోను ఒక్కసారి చూసి ఊరుకోలేరు, మళ్లీ చూడాలని అనిపిస్తోంది’ అంటూ సమంత, అనసూయ, సుకుమార్‌ను ట్యాగ్‌ చేశారు.

రంగమ్మ..మంగమ్మ పాటపై బుడ్డోడి డ్యాన్స్ కి ఫిదా అయిన సమంత!
బుడ్డోడి డ్యాన్స్‌కు సమంత ఫిదా అయ్యింది.. ‘సరే.. ఈ క్యూటీని నేను కిడ్నాప్‌ చేస్తా’ అంటూ లవ్‌ సింబల్స్‌ను ట్వీట్ చేసింది. మొత్తానికి సమంతను ఫిదా చేసిన ఆ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: