ఈ మద్య ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకు ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది.  ఇప్పటికే తెలుగు టాప్ హీరోల మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి.  త్వరలో దర్శకధీరుడు రాజమౌళి  మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ మల్టీస్టారర్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సుడిగాడు దర్శకుడు భిమినేని శ్రీ‌నివాస‌రావు  దర్శకత్వంలో కామెడీ హీరోలు సునీల్, అల్లరి నరేష్ కాంబినేషన్ లో ‘సిల్లీ ఫెలోస్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. 
Image result for allari naresh chilli fellows
అయితే ఇప్పటి వరకు సినిమా టైటిల్ విషయంలో తర్జనభర్జన జరిగినా..మొత్తానికి ‘సిల్లీ ఫెలోస్’ టైటిల్ ఫిక్స్ చేశారు. అల్లరి నరేష్ సుడిగాడు తరువాత వ‌రుస ప్లాప్ ల‌ను ఎదుర్కొన్నాడు.. తమిళంలో హిట్ కొట్టిన తమిజ్ పడమ్ 2.0 మూవీని తెలుగులో సుడిగాడు 2 పేరుతో రీమేక్ కు రెడీ అయ్యాడు..సుడిగాడు దర్శకుడు భిమినేని శ్రీ‌నివాస‌రావు ఈ మూవీకి ద‌ర్శ‌కుడు.. ఈ సినిమాలో సునీల్ కూడా న‌టిస్తున్నాడు.
Image result for director bhimaneni
మొదట సుడిగాడు2 అని వ‌ర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన సినిమా యూనిట్ తాజాగా మూవీ టైటిల్ ను సిల్లీ ఫెలోస్ గా ఖరారు చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసింది. సునీల్ వీపుపై అల్లరి నరేష్ ఎక్కిన స్టిల్ ను పోస్ట‌ర్ లో ముద్రించింది.. షామా ఖాసీం, చిత్రా శుక్లాలు హీరోయిన్స్.. బ్లూ ప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ల సంయుక్త బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న ఈ మూవీకి విశ్వ ప్రసాద్ – వివేక్ కూచిబొట్ల ఈ మూవీకి నిర్మాతలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: