సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన కాలా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది అలాంటిలాంటి హిస్టరీని క్రియేట్ చేయూలేదు. 35 ఏళ్ల తర్వాత కాలా నెలకొల్పిన రికార్డ్ ఇది. పా. రంజిత్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను వండర్ బార్ ఫిలింస్ బ్యానర్ లో ధనుష్ నిర్మించారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి టాక్ తెచ్చుకుంది.


తెలుగులో 30 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ యావరేజ్ టాక్ తో రన్ అవుతుంది. అయితే తమిళనాడులో మాత్రం కాలా కొత్త రికార్డులను సృష్టించింది. ఇదే కాదు కాలా ఖాతాలో ఓ కొత్త రికార్డుని వేసుకున్నాడు.. ముఖ్యంగా 35 ఏళ్ల తర్వాత కాలా రికార్డ్ సృష్టించింది.


రజిని సినిమా ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. అమెరికా, జపాన్, మలేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్ లలో కాలా రిలీజ్ అయ్యింది. అయితే 35 ఏళ్ల తర్వాత సౌదీ అరేబియాలో రిలీజ్ అయిన సినిమా కాలా. అక్కడ 35 ఏళ్లుగా సినిమాలు నిషేధించడం జరిగింది. 


అక్కడ రిలీజ్ అయిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా కాలా రికార్డ్ సృష్టించింది. 35 ఏళ్లుగా సౌదీ అరేబియాలో సినిమాలు నిషేధించారు. ఇటీవలే ఈ నిషేధాన్ని ఎత్తేశారు. మూడున్నర దశాబ్ధాల క్రితం కింగ్ డం అనే సినిమా అక్కడ రిలీజ్ అయ్యింది. సౌదీలో భారతీయ జనాభా భారీగానే ఉన్నారు. అక్కడ కాలాకు సూపర్ క్రేజ్ ఏర్పడింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: