ఆఫీసర్ సినిమా ఫలితం ఫస్ట్ టాక్ తో తెలిసి పోవడం తో ఈ సినిమా ను పట్టుమని మూడు రోజులు కూడా ఉంచని పరిస్ధితి. దీనితో ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో భయంకరమైన ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా వర్మ కావడం తో వర్మ  బాగానే నష్ట పోయాడని తెలుస్తుంది. అయితే రామ్‌గోపాల్‌వర్మతో ఈ టైమ్‌లో సినిమా చేయడమనేది నాగార్జునకి ఇష్టం లేకపోయినా కానీ అదే పనిగా తన వెంట పడుతోన్న వర్మకి నో చెప్పలేక, నిర్మాత కూడా తనే అంటున్నాడు కనుక నాగార్జున 'ఆఫీసర్‌' చేసాడు.

Image result for nagarjuna officer

అది చేయడం ఎంత తప్పో తెలుసుకోవడానికి నాగార్జునకి ఎక్కువ సమయం పట్టలేదు. విడుదలైన మూడు రోజులకే థియేటర్ల నుంచి తీసివేయబడ్డ ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో అతి ఘోరమైన ఫ్లాపుల్లో ఒకటిగా చరిత్ర సృష్టించింది. 'మూవ్‌ ఆన్‌' అయిపోయానని నాగార్జున స్టేట్‌మెంట్‌ ఇచ్చేసాడు. అయితే ఈ చిత్రంతో కాస్తయినా అప్పుల బాధ తప్పించుకోవాలని చూసిన వర్మకి అవి తీరకపోగా కొత్తగా మరిన్ని అప్పులు వచ్చి పడ్డాయి.

Image result for nagarjuna officer

ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడిలో అన్ని హక్కులు కలిపినా తిరిగి వసూలయింది పాతిక శాతమేనట. అంటే దీనిపై ఇన్వెస్ట్‌మెంట్‌లో ముప్పాతిక శాతం పోయినట్టే. నాగార్జునతో తన సినిమా అంటే హాట్‌ కేక్‌లా సేల్‌ అయిపోతుందని భావించిన వర్మకి తనకి ఇప్పుడు మార్కెట్‌లో ఎలాంటి పేరుందో ఆఫీసర్‌తో తెలిసి వచ్చింది. ఈ చిత్రంతో కష్టాల నుంచి బయట పడకపోగా మరింతగా నష్టాల ఊబిలో దిగబడిపోయిన వర్మ ఇక మళ్లీ లేవగలడనేది కూడా అనుమానమే అంటున్నారు సినీ వర్గాల వారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: