ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన ‘బాహుబలి’ మ్యానియాకు ‘రంగస్థలం’ లోని ఒక పాట చెక్ పెట్టడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. తెలుగు సినిమాలలో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నా ఆపాటలను ఆసినిమాలు విడుదలైన కొద్ది రోజులకే జనం మర్చిపోతున్నారు. 
 Rangasthalam song sparks controversy - Sakshi
అయితే దీనికి భిన్నంగా ‘రంగస్థలం’ లోని 'రంగమ్మా మంగమ్మా' పాట సృష్టించిన సునామి అందరికీ తెలిసిందే. యూట్యూబ్ నిండా ఆ పాట రీమిక్స్ లు ఆ పాటకు డబ్ స్మాష్ లు ఎన్నో కనిపిస్తున్నాయి. ఈమధ్య అమెరికాలో జరిగిన ఒక తెలుగు సంస్థ ఉత్సవాలలో ఒక చిన్న పిల్ల చేసిన ‘రంగమ్మా మంగమ్మా’ పాటకు ఆ కార్యక్రమానికి వచ్చిన అమెరికన్స్ కూడ డాన్స్ చేసారు అంటే ఈపాట మ్యానియా ఏస్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. 
Rangasthalam Rangamma Mangamma Song Hit By Controversy
తెలుస్తున్న సమాచారం మేరకు ‘రంగమ్మ మంగమ్మ’ పాట లిరికల్ వీడియో యూట్యూబ్ లో డెభై మిలియన్ల హిట్ లు సాధించింది. అదేపాట ఫుల్ వీడియో సాంగ్ యాభై మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ రెండింటి సంఖ్యను కలిపితే దాదాపు 120మిలియన్ల వ్యూస్ కు చేరుకుంటోంది. 

యూట్యూబ్ లోని తెలుగు వీడియో సాంగ్స్ విషయంలో ‘బాహుబలి’ పాటలదే ఇప్పటి వరకు ఉన్న పెద్ద రికార్డు. ‘బాహుబలి’ లోని ఒక పాటకు వంద మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఆస్థాయిని మించి ‘మంగమ్మ’ పాటకు వ్యూస్ వస్తున్నాయి అంటే జనం ఇప్పటికీ ‘రంగస్థలం’ మూవీని మర్చిపోలేకపోతున్నారు అన్న విషయం అర్ధం అవుతోంది. అందుకే ఈమూవీ రీమేక్ హక్కుల కోసం కూడ కోలీవుడ్ బాలీవుడ్ ల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఏమైనా చరణ్ ప్రభాస్ రికార్డులకు అనుకోకుండా ఎర్త్ పెట్టాడు అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: