నాగార్జునతో రామ్ గోపాల్ వర్మ 'ఆఫీసర్' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే తన తదుపరి సినిమా అఖిల్ తో ఉంటుందని వర్మ చెప్పాడు. అసలే సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అఖిల్ .. వర్మతో సినిమా చేయనుండటం ఎంతవరకూ కరెక్ట్ అనే విషయంపై అందరూ మాట్లాడుకున్నారు. '

‘ఆఫీసర్’ సినిమా ఘోర పరాజయం చవిచూడటం, అక్కినేని అభిమానులు ఆర్జీవీపై ఆగ్రహం ప్రదర్శించిన నేపథ్యంలో అఖిల్.. ఆర్జీవీకి ప్రాజెక్టుకు దూరంగా ఉండటమే ఉత్తమం అని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా అఖిల్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘వర్మతో నేను సినిమా చేస్తున్నాననే వార్త ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో తెలీదు.

ప్రస్తుతం నేను నా తర్వాతి సినిమా కోసం లండన్ వెళ్తున్నా.. ప్రస్తుతం అదొక్కటే నా మైండ్‌లో ఉంది’’ అంటూ పరోక్షంగా స్పష్టత ఇచ్చాడు. అభిమానులకు నచ్చే సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే నా ముందున్న లక్ష్యం" అంటూ చెప్పుకొచ్చాడు. అఖిల్ ధోరణి చూస్తుంటే ఆయన వర్మ సినిమా చేయడం లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పాడనిపించడం లేదూ!ప్రస్తుతం అఖిల్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: