సూపర్ స్టార్ రజినికాంత్, పా. రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన కబాలి, కాలా రెండు సినిమాలు రజిని ఫ్యాన్స్ ను అలరించేలా వచ్చినా సగటు ప్రేక్షకుడిని మాత్రం మెప్పించలేదు. కబాలి అయితే భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర చతికిల పడ్డది. ఇక కాలా దాని కన్నా బెటర్ అని చెప్పొచ్చు.


కబాలి ఫ్లాప్ అయినా కాలా సినిమా ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. అయితే కాలాని కూడా పా. రంజిత్ తనదైన స్లో నరేషన్ తో ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. అయితే కబాలి కన్నా కాలా మంచి టాకే తెచ్చుకుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ పా. రంజిత్ మూడో సినిమా రజినితో చేసే అవకాశాలున్నాయట.


ఈ న్యూస్ వినగానే రజిని ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమానా అయ్య బాబోయ్ అనేస్తున్నారు. ఓ రకంగా రజిని ఫ్యాన్స్ కు ఈ కాంబినేషన్ మీద ఓ రకమైన ఫీలింగ్ కలిగింది. రజిని ఇమేజ్ కు తగిన కథలతో రంజిత్ సినిమా చేయట్లేదు అన్న భావన ఉంది.


కబాలి, కాలా సినిమాలు చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. తెలుగులో కాలా 30 కోట్ల బిజినెస్ తో అది కూడా అడ్వాన్స్ రూపంలో వచ్చింది. మరి ఈ మాంబోలో మూడవ సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. కోలీవుడ్ లో ఎలా ఉన్నా ఈ కాంబినేషన్ సినిమా అంటే టాలీవుడ్ ఆడియెన్స్ మాత్రం వద్దండి బాబు అనేస్తున్నారు.  
    


మరింత సమాచారం తెలుసుకోండి: