తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’ ఈ నెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రజనీకి గల క్రేజ్ కారణంగా విడుదలైన ప్రతి చోటున ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. కబాలి దర్శకుడు పా. దర్శకత్వంలో మరోసారి తెరపై కనిపించారు రజినీ. పొలిటికల్ ఎంట్రీ తరువాత వస్తున్న మూవీ కావడంతో పాటు ఈ చిత్రాన్ని రజినీ అల్లుడు ధనుష్ స్వయంగా నిర్మించడంతో మరింత హైప్ వచ్చింది. తమిళనాడులో రజినీకాంత్‌కి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 చెన్నైలో కాలా సరికొత్త రికార్డ్
సుమారు రెండేళ్లుగా తలైవా మూవీ కోసం ఎదురు చూస్తున్న చెన్నై ఫ్యాన్స్ ‘కాలా’ కళ్లుచెరిరే రికార్డ్‌ను అందించారు. చెన్నై సిటీలో తొలిరోజు రూ. 1.76 కోట్ల గ్రాస్ రాబట్టి తమిళ దలపతి విజయ్ ‘మెర్సల్’ పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. మెర్సల్ మూవీ చెన్నై సిటీలో తొలిరోజు రూ. 1.52 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ లెక్కన మెర్సల్ కంటే రూ. 24 లక్షల గ్రాస్ ఎక్కువ రాబట్టింది ‘కాలా’.

చెన్నైలో తొలిరోజు వసూళ్ల విషయంలో రికార్డును సృష్టించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోను అదే జోరును చూపించింది.తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 3.2కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగడం ఖాయమని అంటున్నారు. రజనీ ఛరిష్మా .. నానా పటేకర్ నటనలో సహజత్వం .. హుమా ఖురేషి గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని అంటున్నారు.

ఈ మూడు రోజులు ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించనుంది.వచ్చే సోమవారం నుండి కాలా ఇక్కడ పెద్ద పరీక్ష నే ఎదురుకోనుంది . పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానా పటేకర్ ,హుమా ఖురేషి ముఖ్య పాత్రల్లో నటించారు .

 

మరింత సమాచారం తెలుసుకోండి: