తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి లాంటి బ్లాక్ బస్టార్ చిత్రాలు అందించిన ఎస్ ఎస్ రాజమౌళి త్వరలో ఓ అద్భుతమైన మల్టీస్టారర్ చిత్రాన్ని తీయబోతున్న విషయం తెలిసిందే.  రంగస్థలంలో మంచి హిట్ కొట్టిన రాంచరణ్, జై లవకుశ తో మరో ఘనవిజయం అందుకున్న ఎన్టీఆర్ కాంబినేషన్ లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన పనులు చక చకా సాగిపోతున్నాయి.
Related image
గతంలో వీరిద్దరితో రాజమౌళి చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. రాంచరణ్ తో ‘మగధీర’, ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తీశారు.   గత కొంత కాలంగా రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య సాన్నిహిత్యం రోజురోజుకు బలపడుతోంది.  కొంత కాలంగా  ఎన్టీఆర్ ఫ్యామిలీ, రాంచరణ్ ఫ్యామిలీ కలుసుకుంటున్నారు.
Image result for ram charan ntr
తాజగా ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రాంచరణ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  రాంచరణ్ సోఫాలో కూల్ గా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారు..ఆయన వెనక పై భాగంలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంది.ఈ అందమైన దృశ్యాన్ని జూ. ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

లెజెండరీ ఆలోచనలు ప్రభావం చూపేలా అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. రాంచరణ్, ఎన్టీఆర్ నటించబోయే చిత్రాన్ని రాజమౌళి అక్టోబర్ నుంచి ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: