త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సామెత షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. మాటల మాంత్రికుడు కూడా ఎన్టీఆర్ వేగాన్ని అందుకుంటూ షూటింగ్ ని శరవేగంగా కానిచ్చేస్తున్నాడు. మే 20 న అరవింద సామెత ఫస్ట్ లుక్ తో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ కొత్త సినిమాపై మళ్ళీ ఇన్నాళ్లకు మరో హాట్ హాట్ న్యూస్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరుకు ఎన్నో కామెడీ పాత్రలు వేసి..ప్రస్తుతం కామెడీ హీరోగా రానిస్తున్న నటడు శ్రీనివాస్ రెడ్డి తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అభిప్రాయ భేదాలు వచ్చాయని..గతంలో  ఎన్టీఆర్ టిడిపి తరుపున ఎన్నికల ప్రచారం వరకు బాగా కలిసున్నా ఎన్టీఆర్ – శ్రీనివాస్ రెడ్డి లు ఆ తర్వాత సైలెంట్ గా విడిపోయారు వార్తలు వచ్చాయి.
Image result for ntr aravindha sametha
ఇప్పుడు అరవింద సామెత లో కమెడియన్ గా శ్రీనివాస రెడ్డి ని తీసుకుందామన్న.. త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ వద్దని చెప్పాడంట. అయితే ఆ కేరెక్టర్ కి శ్రీనివాస్ రెడ్డి అయితేనే బావుంటుందని త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ని కన్విన్స్ చేయడంతో ఎన్టీఆర్ ఒకే అన్నాడట.  దర్శకులు త్రివిక్రమ్ ఒకవేళ ఇద్దరు కలిసి నటించాల్సిన సీన్లు ఎలా హ్యాండిల్ చేస్తారన్న అనుమానాలు రావడంతో అభిమానులు తెగ టెన్షన్లో పడ్డారు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ..తమ మద్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని ఒక్కసెల్ఫీతో సమాధానం చెప్పారు..ఎన్టీఆర్, శ్రీనివాస్ రెడ్డి. 
Image result for ntr aravindha sametha
 శనివారం  ఎన్టీఆర్ – శ్రీనివాస్ రెడ్డి లు కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో దిగిన సెల్ఫీ సోషల్ మాద్యమాల్లో చక్కర్లు కొడుతుంది. తమపై వచ్చిన వార్తలకు శ్రీనివాస్ రెడ్డి, ఎన్టీఆర్ లు ఒకే ఒక సెల్ఫీ తో చెక్ పెట్టారనేది ఆ సెల్ఫీ సారాంశం.

మరి నిజంగానే వాళ్ళ మధ్యన కోల్డ్ వార్ ఏం లేదని.. వారు చాలా చక్కగా కలిసి మెలిసి పనిచేసుకుంటున్నారని తేలిపోయింది. మరి ఎన్టీఆర్, శ్రీనివాస్ రెడ్డి లు చాలా తెలివిగా తమ మధ్యన ఏం లేదని ఒకే ఒక పిక్ తో భలే సమాధానం చెప్పారు. ఇక త్రివిక్రమ్ కూడా ఆ సెల్ఫీ లో భాగమైయ్యాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: