ఈ మద్య సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఎలాంటి న్యూస్ వైరల్ అవుతుందో ఎవ్వరికి తెలియదు. కాస్త కొత్తగా అనిపించినా కూడా గూగుల్ లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి చేసిన డ్యాన్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. డాన్సింగ్ అంకుల్ అని అతనికి ఓ పేరు కూడా వచ్చేసింది. సోషల్ మీడియాలో ఇప్పటికే అతనికి సంబందించిన నాలుగు వీడియోలు హల్చల్ చేయగా మరొక కొత్త వీడియో వైరల్ అయ్యింది. ఆ డ్యాన్సింగ్ అంకుల్ పేరు సంజీవ్ శ్రీవాత్సవ...ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు. 

ప్రొఫెసర్ శ్రీవాత్సవ ఒక పెళ్లిలో చేసిన గోవిందా స్టెప్పులు అందరికి బాగా నచ్చాయి. యూత్ లో అయితే అతనికి క్రేజ్ బాగానే వచ్చింది. ఇక ఈ క్రేజ్ ను ఒక కంపెనీ బాగా వాడుకుంటోంది. బజాజ్ అళియన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసి కి సంబందించిన ఒక వీడియో ను పోస్ట్ చేశారు. ఇక అంకుల్ డ్యాన్స్ చూసి సినిమా ప్రముఖులు కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.
Image result for డ్యాన్సింగ్ అంకుల్
కొందరైతే ఇమిటేట్ కూడా చేస్తున్నారు.  తాజాగా డ్యాన్సింగ్ అంకుల్ రీసెంట్‌గా తన ఫ్యామిలీతో సహా సల్మాన్ భాయ్‌ని కలిశాడు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'దస్ కా దమ్3' అనే టీవీ షో షూటింగ్‌లో ఉండగా.. షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి సల్లూ భాయ్‌ని కలుసుకున్నట్లు డ్యాన్సింగ్ అంకుల్ ట్వీట్ చేశాడు. తన ఫ్యామిలీ సల్మాన్‌తో దిగిన ఫోటోలను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: