యువ నటి ఆలియా భట్ అందగత్తే కాదు కొన్ని విశ్వాసాల ప్రాతిపదికగా జీవితాన్నే చూసే ఒక ప్రత్యేక వ్యక్తి. నోట్లో గోల్డెన్ స్పూన్ తో పుట్టిన అదృష్టవంతురాలు. ఈమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ ముద్దుల కూతురు. అంతే కాదు ఆమె కుటుంబ నెపధ్యమంతా బాలీవుడ్ సినీ రంగమే. 25 యేళ్ళ ఈమె ప్రముఖ కథానాయకి, మాత్రమే కాదు అద్భుత గాయని కూడా. 


నటించిన సినిమాలన్నీ అధుత విజయాలే ఆర్ధికంగా అద్భుతమే.  అయితే  స్టార్‌-స్టేటస్‌ ఎంజాయ్‌ చేస్తున్న హీరోయిన్‌లు పెళ్లి గురించి ప్రస్తావించడానికి ఇష్టపడరు. కెరీర్‌ గ్రాఫ్‌ గురించో, లేదా వ్యక్తిగత విషయాలు రహస్యంగా ఉండటం కోసమో పెళ్లి ఊసెత్తితే చాలు మాట దాటేయటమో లేదా మౌనవ్రతం చేస్తుంటారు. 


కానీ ఆలియా భట్‌ అలా కాదు. 30కి ముందే మూడు ముళ్లు వేయించుకుంటానేమో? అంటున్నారు. పెళ్లి విషయం గురించి ఆలియా మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం పెళ్లి మీద ఎటువంటి ఆలోచనలు లేవు. హృదయ పూర్వకంగా చెప్పాలంటే పెళ్లి  ఇప్పుడు జరగాలి, అప్పుడు  జరగాలి అని ప్లాన్‌  చేసుకునే  టైప్‌ కాదు నేను. ఆ క్షణంలో ఎలా  చేయాలనిపిస్తే అలానే చేసేస్తా.

Related image

నా ఉద్దేశంలో ఏదైనా "ఎక్స్‌పెక్ట్‌" చేయనప్పుడు ఆశ్చర్యం కలిగించే అద్భుతం జరిగితేనే అసలు కిక్కు.  అందరూ నేను ముప్ఫై ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటాననుకుంటా రేమో. దాని కంటే ముందే చేసుకొని సర్‌ప్రైజ్‌ చేస్తానేమో.  నాకు లివ్‌-ఇన్‌-రిలేషన్‌షిప్‌ మీద మంచి అభిప్రాయం లేదు.  సహజీవనం సరి కాదు, అన్నది నా అభిప్రాయం.

Image result for ranabir alia beautiful

అందుకే నాకు నచ్చిన వాడు దొరికితే "ఐలవ్‌ యు. మనం పెళ్లి చేసుకునే కలిసుందాం. పెళ్లి తర్వాత కూడా నేను నటిస్తాను ఎందుకంటే నిన్ను ప్రేమించినట్లే వృత్తిని నటనను ప్రేమిస్తాను" అని చెప్పేస్తాను అమె తన హృదయం బయటపెట్టేశారు ఆలియా భట్‌. ప్రస్తుతం బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌బీర్‌ తో లవ్‌ లో ఉన్నారని టాక్‌. ఈ రిలేషన్‌-షిప్‌ని ఉద్దేశిస్తూ ఆలియా భట్‌, ఇలా మాట్లాడి ఉంటారా?  అంటే పెళ్ళి మేళం వినిపించనుందా!  

Alia Bhatt at the IIFA Awards 2017 (2) (cropped).jpg

మరింత సమాచారం తెలుసుకోండి: