ప్రముఖదర్శకుడు ఈవివి సత్యనారాయణ జయంతి సందర్భంగా ఈరోజు ఒకప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్ తన అన్న ఆర్యన్ రాజేష్ తో కలిపి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర అంశాల పై స్పందించాడు. తన కెరియర్ గురించి అదేవిధంగా ఈమధ్య కాలంలో తనను వెంటాడుతున్న ఫెయిల్యూర్స్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

ప్రస్తుతం తాను కష్టపడి సినిమాలు చేస్తున్నా తనకు సక్సస్ రాకపోవడం కొంత నిరాశ కలిగిస్తోంది అని అంటూ తనతండ్రి ఈవివి బ్రతికి ఉన్న రోజులలో తనకు రెండు ఫ్లాప్ లు వస్తే ఒక హిట్ సినిమాను తనతో తీసి తనచేతిలో పెట్టిన గొప్ప వ్యక్తి తన తండ్రి అంటూ అలాంటి వ్యక్తుల సపోర్ట్ ప్రస్తుతం తనకు లేదు అని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో తన అన్న రాజేష్ తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ తామిద్దరమూ కవలపిల్లలం కాకపోయినా తమ చిన్నతనంలో కవలలు లాగానే పెరిగాము అన్న కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు తండ్రి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా తామిద్దరం కలిసి ఉంటున్న విషయాన్ని వివరిస్తూ తమ తండ్రి తమమధ్య ఆస్థులు పంచలేదని ఆయన ఏమికొన్నా రెండేసి కొంటూ సమానంగా తనకు తన అన్నకూ ఇచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. అదేవిధంగా ఇప్పటికీ తమ ఇంట్లో అందరికంటే స్ట్రాంగ్ తన తల్లి మాత్రమే అని చెపుతూ తన తల్లికి తెలియకుండా తామిద్దరం ఎటువంటి ఖర్చులు చేయము అంటూ తన తల్లిపట్ల తనకు ఉన్న ప్రేమను వ్యక్తఅరిచాడు ఈ అల్లరి నరేశ్.

ఇదే సందర్భంలో తనకు తన చిన్న తనంలో తన తండ్రి పెట్టిన బాధలను వివరిస్తూ తాను 8, 9వ తరగతిలో ఉన్నప్పుడు తన తండ్రి తనకు అప్పటికి ఉన్న ఆర్ధిక పరిస్థితి రీత్యా తన పుట్టినరోజునాడు 25 చాక్లెట్స్ కొని ఇచ్చి తన క్లాసులో పంచమని ఇచ్చిన సందర్భాన్ని వివరిస్తూ 72 మంది విద్యార్ధులు ఉంటే ఆ 25 చాక్లెట్స్ ఎలా పంచాలో తెలియక తాను తన చిన్నతనంలో తన తండ్రిని తిట్టుకున్న సందర్భాన్ని జోక్ గా గుర్తుకు చేసుకున్నాడు. తన తండ్రి అనుకున్నట్లుగానే తాము అంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న విషయాన్ని తెలియ చేస్తూ తమ జీవితంలో తమ తండ్రి పేరు పాడుచేయకుండా ఇండస్ట్రీలో అత్యంత గౌరవప్రదంగా జీవించాలి అన్నది తమ ఇద్దరి ఉద్దేశ్యం అంటూ ‘హలో నాన్న’ అంటూ అల్లరి నరేశ్ తన కుటుంబం గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలను వివరించాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: