ఈ మద్య బీజేపీ నేతలు, కార్యకర్తలు దూకుడు స్వభావం వార్తల్లో సంచలనం సృష్టిస్తున్నారు. మొన్న ఓ నేత ప్రభుత్వం అధికారుల కన్నా వేశ్యలే నయం అన్నారు..నిన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ ని బూతులు తిడుతూ చెంపలు వాయించారు ఓ నేత.  తాజాగా తమిళ దర్శకుడు అమీర్ పై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పైనా ఆరోపణలు గుప్పిస్తున్న కోలీవుడ్ దర్శకుడు అమీర్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.
Image result for rajinikanth
కోవైలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన రాజకీయ చర్చావేదికలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమంలో అమీర్ సహా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసాయ్ సౌందర్ రాజన్, కొంగు ఇళంజర్ పేరవై నిర్వాహకుడు తనియరసు తదితరులు పాల్గొన్నారు. చర్చ ప్రారంభించిన తర్వాత అమీర్ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు.  తమపై లేని పోని నిందలు వేస్తున్నారని ఆరోపిస్తూ సీరియస్ అయ్యారు. దాంతో వివాదం బాగా ముదిరిపోతుందని భావించిన నిర్వాహకులు అమీర్ ని ఆయన బసచేసిన హోటల్ కి పంపించారు.

ఆ రోజు రాత్రి ఇళంజర్‌ పేరవై నిర్వాహకులు కారులో కరుమత్తంపట్టి గ్రామానికి బయలుదేరారు. ఆ కారులో దర్శకుడు అమీర్ ఉన్నట్టు అనుమానించిన బీజేపీ కార్యకర్తలు కొందరు  దాన్ని అడ్డగించి రాళ్లు, గడ్డపారలతో దాడి చేశారు.  దాడిలో కారు అద్దాలు పూర్తిగా ద్వంసం అయ్యాయి..కారులో ఉన్న వారు బిక్కు బిక్కు మంటూ బయటకు వచ్చారు..వారిలో అమీర్ లేకపోవడంతో దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. పేరవై నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: