యంగ్ హీరోలలిస్టులో మొదట్లో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుని ఆతరువాత వరస పరాజయాలతో సతమతమైపోతున్న రాజ్ తరుణ్ వ్యవహారశైలి పై ఇప్పుడు ఘాటైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న గాసిప్పుల ప్రకారం ఎవరైనా ఈ యంగ్ హీరోకి సబ్జెక్ట్ చెప్పడానికి వస్తే వారిని ఆకథకు సంబంధించిన సినాప్సిస్ అడుగుతున్నాడట రాజ్ తరుణ్. 
జాగ్రత్తలలో రాజ్ తరుణ్
అంతేకాదు ఆ కథకు సంబంధించిన కథను తనకు దర్శకులు గంటలు గంటలు చెప్పకుండా మూడు నాలుగు పేరాల్లో ఒక్క పేజీలో సినాప్సేస్ కింద ఇమ్మని అడుగుతున్నాడట రాజ్ తరుణ్. టాప్ హీరోలు కూడ దర్శకులు చెప్పే కథలను మనసుపెట్టి వింటున్న పరిస్థుతులలో రాజ్ తరుణ్ తన సినిమా కథల విషయంలో చేస్తున్న ప్రమోగాలు అర్ధంకాక చాలామంది దర్శకులు తల పట్టుకుంటున్నట్లు టాక్. 

వరుస సక్సెస్‌లతో భారీగా రెమ్యునరేషన్

అంతేకాదు రాజ్ తరుణ్ రిజెక్ట్ చేసిన పలు సబ్జెక్టులతో నాని శర్వానంద్ లు నటించి బ్లాక్ బస్టర్స్ కొట్టేశారనే టాక్ ఉంది. నాని చేసిన ‘నేను లోకల్’ మొదటిగా రాజ్ తరుణ్ వద్దకు వస్తే అతడు తిరస్కరించడంతో నానీకి అదృష్టంగా మారింది అన్న వార్తలు కూడ ఉన్నాయి.  సినీ పరిశ్రమలో సక్సెస్ మాత్రమే చూసే నేపధ్యంలో రాజ్ తరుణ్ తన కెరియర్ పై తానే చేసుకుంటున్న ప్రయోగాల వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

స్క్రిప్టులపై యువ హీరో దృష్టి 

ఇది ఇలా ఉండగా గతవారం విడుదలైన ‘రాజుగాడు’ మూవీ ఘోరమైన ఫ్లాప్ తరువాత రాజ్ తరుణ్ తన ఫోన్ స్విచాఫ్ చేసుకుని ఎవరికీ అందుబాటులో లేకుండా ప్రవర్తిస్తున్నాడు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనితో రాజ్ తరుణ్ తన సినిమా కథల ఎంపికలో జాగ్రత్త పడాలి కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఏమి ప్రయోజనం అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యతిరేక పరిస్తుతులను గమనించిన రాజ్ తరుణ్ తన పారితోషికాన్ని బాగా తగ్గించుకున్నాడు అని వార్తలు వస్తున్నా రాజ్ తరుణ్ వ్యవహార శైలి మారకుండా ప్రయోజనం ఉండదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: