మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ షురూ అయిన సంగతి తెలిసిందే. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో రాబోతున్నాడు. రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా వారాయి చలనచిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈ నెల 24న రిలీజ్ చేయాలని చూస్తున్నారట.


తండ్రి కొడుకుల సెంటిమెంట్ కథతో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ లుక్ బాగుంది. ఇక ఈ సినిమా ఆడియోకి మెగా హీరోలంతా కలిసి వస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవితో పాటుగా రాం చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ అటెండ్ అవనున్నారట. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆడియోకి వచ్చేలా చూస్తున్నారట.


కొన్నాళ్లుగా మెగా హీరోలంతా ఎవరికి వారు అన్న తీరున ఉన్నారు. ఫ్యాన్స్ లో కూడా చీలిక వచ్చిందని తెలుస్తుంది. అయితే ఈ మెగా కలయికతో ఒక్కసారిగా అన్ని రూమర్స్ కు చెక్ పెట్టేయాలని చూస్తున్నారు. ఇక కళ్యాణ్ దేవ్ విజేత సినిమా ఫస్ట్ లుక్ మెగా అభిమానులను ఆకట్టుకుంది.


ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగా హీరోలంతా ఆడియో వేడుకకి రావడం గొప్ప విషయమని చెప్పొచ్చు. మెగా ట్యాగ్ తో వస్తున్న కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాతోనే క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడు. మరి సినిమాతో కుర్రాడు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: