మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్ కెరీర్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో దర్శకులు కరుణాకరణ్ ‘తొలిప్రేమ’సూపర్ హిట్ గా నిలిచింది.  ఆ తర్వాత పవన్ కళ్యాన్ వరుస విజయాలు సొంతం చేసుకున్నాడు.  తర్వాత కరుణాకరణ్ తీసిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.  తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు.  ప్రస్తుతం కరుణాకరణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ‘తేజ్ ఐ లవ్ యూ’వస్తుంది. 
Image result for pawan kalyan tholi prema\
ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకను శనివారం (జూన్ 9) హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా  చిరంజీవి మాట్లాడుతూ..లవ్ స్టోరీలను తెరకెక్కించడంలో కరుణాకరన్ ప్రతిభ ఏంటో అందరికీ తెలుసు. ఆయన సినిమాల్లో తొలిప్రేమ నాకు ఇప్పటికీ ఇష్టం. మా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా తొలి ప్రేమ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆ సినిమాల్లో పవన్‌ను చూపించనంత చక్కగా మరెవరూ చూపెట్టలేదు. వైట్ అండ్ వైట్ పవన్ నా కళ్ల ముందు ఇప్పటికీ కదలాడతాడు’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మరింత అందంగా కనిపించిందని కితాబిచ్చారు. సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా నటించాడని కొనియాడారు. 

ఇలాంటి టాలెంట్ ఉన్న దర్శకులు గ్యాప్ తీసుకోవడం ఇండస్ట్రీకి అన్యాయం చేసినట్లు అవుతుందని..ఆయన తనకు ఎంత పెద్ద అభిమానో చెప్పుకొచ్చారు. ‘డైరెక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. ఇలా ఎంతో మంది పేరున్నవారు కూడా నాపై ప్రేమ, అభిమానం కురిపిస్తున్నారు. అంతకంటే ఈ జన్మకు కావాల్సింది ఏముంటుంది? ఈ జన్మకిది చాలదా! అభిమానుల ఈలలు, చప్పట్లు నాకు ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్నిస్తాయి.. ఆ దాహం తీరనిది..’ అని మెగాస్టార్ అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: