తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య బయోపిక్ సినిమాల పర్వం మొదలైంది.  ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించి మెప్పించారు.  ప్రస్తుతం ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్ చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి.  ఇక ఎన్టీఆర్ బయోపిక్ కి మొదట తేజ దర్శకుడిగా తీసుకున్నా ఆయన పక్కకు తప్పుకోవడంతో..ఆయన స్థానంలో క్రిష్ ని తీసుకున్నారు.  
Image result for ntr biopic
ప్రస్తుతం క్రిష్ అన్ని పనులు మొదలు పెట్టారు..తాజాగా క్రిష్ మార్క్ చాటుకుంటూ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ‘తన నూరవ చిత్రంలో అమ్మ పేరు ధరించి కూస్తంత మాతృరుణం తీర్చుకున్న బసవ రామ తారక పుత్రుడు, ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృరుణాన్ని కూడా తీర్చుకుంటున్నారు.
Image result for ntr biopic
తారక రామ పుత్రుడు, శతాధిక చిత్ర ‘నటసింహం’, నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని  ‘యన్.టి.ఆర్’ చిత్ర దర్శకుడు క్రిష్  పేర్కొన్నారు.ఈ ఫస్ట్ లుక్ లో బాలకృష్ణ మీసాలకు ఆయన తండ్రి ఎన్టీఆర్ మెరుగులు దిద్దుతున్నట్టు చూపించడం ఆసక్తికరంగా ఉంది. ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని వారాహి చలన చిత్ర సంస్థ, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: