భారత దేశంలో బిగ్ బాస్ రియాల్టీ షో కి మంచి ఆదరణ లభిస్తుంది.  బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఇప్పటికే పది సీజన్లు పూర్తి అయ్యాయి.  ఇక తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా బిగ్ బాస్ కి మంచి క్రేజ్ వచ్చింది.  తెలుగు లో మొదటి సీజన్ ఎన్టీఆర్, తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో సుదీప్ లు హోస్ట్ గా వ్యవహరించారు. తెలుగు లో ప్రస్తుతం రెండవ సీజన్ మొదలయ్యింది..నేటి నుంచి ప్రారంభం అవుతుంది.  
Image result for big boss 2
బిగ్ బాస్ 2 కి వ్యాఖ్యాతగా నేచురల్ స్టార్ నాని వ్యవహరిస్తున్నారు.  మరోవైపు ఈనెల 17 నుంచి తమిళంలోనూ ఈ షో ప్రసారాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో నటించేవారి గురించి స్పష్టమైన ప్రకటన రాకపోయినప్పటికీ ప్రముఖ హీరోయిన్లు ఉంటారని ఎన్నో పుకార్లు వస్తున్నాయి.  కాగా, తమిళ షోలో తాను పాల్గొంటున్నట్లు వస్తోన్న వార్తలను ప్రముఖ నటి రాయ్‌ లక్ష్మి ఖండించింది.

బిగ్‌బాస్‌లో తాను ఉన్నట్లు తన గురించి కొందరు పదే పదే వీడియోలు సృష్టిస్తుండంతో సోషల్‌ మీడియాలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం గురించి పదే పదే వివరణ ఇవ్వాల్సి వస్తున్నందుకు విసుగొస్తోందని పేర్కొంది. తాను ఇప్పుడు సినిమా షూటింగ్ బిజీలో ఉన్నానని..బిగ్ బాస్ లో నటించే అవకాశం లేదని అన్నారు. అయినా కూడా ఛానెల్‌కు చెందిన కొందరు సిల్లీ వ్యక్తులు తన పేరు వాడి అమాయకులను ఫూల్స్‌ చేస్తున్నారని ఆమె పేర్కొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: