సోషల్ మీడియా.. ఈ కాలం సగటు మనిషి జీవితంలో ఇది కూడా ఒక భాగమే. మన స్నేహితులు, బంధువులు వాళ్ళే కాకుండా మనం అభిమానించే తారల వ్యక్తిగత జీవిత విషయాలను కూడా తెలుసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇక సినీతారలు సైతం ప్రతి రోజు వారు ఎక్కడున్నది, ఏం చేస్తున్నది ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ తమ అభిమానాలను ఆనందపరుస్తూ వారితో టచ్లో ఉంటారు. 


ఇలా  సోషల్ మీడియాలో తరచూ యాక్టీవ్ గా ఉండటమే ఒక నటికి చేదు అనుభవాల్ని మిగిల్చింది. ఏకంగా తన అభిమాని ఆమెను లైంగికంగా వేధించే వరకు వెళ్ళింది. వివరాల్లోకివెళితే సోఫియా హయత్ అనే బ్రిటిష్, ఇండియన్ నటి బాలీవుడ్లో నటిస్తూ మంచిపేరును సంపాదించింది. ఆక్సర్ 2 అనే బాలీవుడ్ సినిమాతో అందరికీ సుపరిచితమయినా హిందీ బిగ్ బాస్ సీజన్ 7 తో పాల్గొని ప్రేక్షకులకు ఇంకా దగ్గరయింది.


ఈ అమ్మడు కూడా తరచూ తన సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలు పెట్టి అభిమానులను ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. అయితే ఆమె మొన్న ఒక ఫోటో పెట్టగా ఒక్క రాత్రికి నీ రేట్ ఎంత అంటూ ఒక అభిమాని ఆమెకు సందేశం పంపించి ఆమెకు షాకిచ్చాడు. ఆమె కూడా అతనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మొదట మీ అమ్మను, ఆ తరువాత నీ సోదరిని, అటు తరువాత నీ భార్యను అడుగు వాళ్ళు చెబుతారు అని అతనికి రిప్లై ఇచ్చింది. దీనికి అతడు మళ్ళీ స్పందిస్తూ.. వాళ్ళు నీలాగా ఒళ్ళు చూపించారు అని ఆమెకు బదులిచ్చాడు. దీనితో ఆమె మళ్ళీ.. మీ అమ్మ తన కాళ్ళు చాచి నీకు జన్మ ఇస్తుంది. నీకు రంజాన్ మాసం అంటే లెక్కలేదు అని రాసుకొస్తూ తమ మద్య జరిగిన సంభాషణను స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: