ప్రిన్స్ మహేష్ బాబు రఫ్ లుక్ తో కనిపించడానికి పెద్దగా ఇష్టపడడు. దీనికితోడు అతడి అభిమానులు అంతా ప్రిన్స్ అంటూ పిలుస్తారు కాబట్టి హుందాగానే కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మహేష్.  ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ ‘భరత్ అనే నేను’ ఇలా అన్ని సినిమాలలోను మహేష్ క్లాస్ లుక్ తోనే కనిపించాడు. 
mahesh-babu-new-look-quite-relatable
మహేష్ తో పోటీ పడుతున్న టాప్ యంగ్ హీరోలు అంతా తాము నటించే ప్రతి సినిమాకు ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న నేపధ్యంలో ఇక కష్టం అనుకుని మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీకి గడ్డంతో కనిపించడానికి చాల కష్టపడి ఒప్పుకుని ఇప్పుడు ఆ ప్రయత్నాల పై ఉన్నాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీ కోసం తాను పెంచుకున్న గడ్డంతో ఈమధ్యనే విదేశాల నుండి హైదరాబాద్ కి వచ్చాడు మహేష్. 
Mahesh Babu stuns with his droolworthy look
ఈ పరిస్థుతులలో మహేష్ నిన్న తన గడ్డం లుక్ తో రెండు పబ్లిక్ ఫంక్షన్ లకు అటెండ్ అయ్యాడు. అందులో ఒకటి మహేష్ బావ సుధీర్ బాబు నటిస్తున్న ‘సమ్మోహనం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్. మహేష్ మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు కానీ ఆలుక్ మహేష్ కు పూర్తిగా సూట్ అవ్వలేదేమో అన్న కామెంట్స్ ‘సమ్మోహనం’ ఫంక్షన్ లో వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి మహేష్ గతంలో న్యూలుక్ కోసం సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయోగం వికటించి తన ముఖంలో గ్లో తగ్గడంతో మహేష్ ఆ ప్రయోగాన్ని విరమించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ గడ్డం ప్రయోగం పై కొంతమంది కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో ప్రిన్స్ తన లుక్ ను ఇదేవిధంగా రానున్న రోజులలో కొనసాగిస్తాడా లేదంటే కేవలం వంశీ పైడిపల్లి సినిమాతో సరిపెడతాడా అన్న విషయానికి సమాధానం ఈసినిమా రిజల్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: