అక్కినేని నాగార్జున వారసత్వంతో రెండు సినిమాలు చేసినా అఖిల్ కు ఏమాత్రం కలిసి రాలేదు. దీనితో అఖిల్ పేరు చెపితే టాప్ దర్శకులు భయపడిపోయిన పరిస్థుతులు ఏర్పడ్డాయి. కొరటాల శివ లాంటి టాప్ డైరెక్టర్ కు 15 కోట్ల పారితోషికం ఇస్తాము అన్నా అఖిల్ తో సినిమా చేయడానికి ఇష్టపడలేదు అంటే అఖిల్ దురదృష్టం ఏస్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. 
From an actor to a successful director: Venky Atluri's journey
ఇలాంటి పరిస్థుతులలో అఖిల్ వెంకీ అట్లూరితో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ లాంటి సూపర్ హిట్ మూవీని తీసిన వెంకీ అట్లూరికి అఖిల్ తో సినిమాను తీస్తున్నందుకు దర్శకుడుగా 1.5 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక యంగ్ డైరెక్టర్ కు కోట్ల రూపాయల స్థాయిలో పారితోషికం ఇవ్వడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 
Akhil
ఇలాంటి భారీ పారితోషికం వెంకీ అట్లూరికి రావడం వెనుక అఖిల్ ఫ్యాక్టర్ బాగా పనిచేసింది అంటారు. ఫెయిల్యూర్ హీరోగా పేరు తెచ్చుకున్న అఖిల్ తో సినిమా చేయాలి అంటే తనకు ఇలాంటి భారీ పారితోషికం కావాలి అని వెంకీ అట్లూరి డిమాండ్ చేసినట్లు టాక్. 
venky atluri and akhil akkineni
త్వరలో ఈసినిమాకు సంబంధించిన అవుట్ డోర్ షూటింగ్ కోసం ఈమూవీ యూనిట్ విదేశాలకు వెళ్ళబోతోంది. అఖిల్ ను ఎలాగైనా నిలబెట్టాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ పై కూడ భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. వెంకీ అట్లూరి మ్యాజిక్ కూడ కలిసిరాక అఖిల్ కు మూడవ పరాజయం వరసగా ఎదురైతే నాగార్జున ఎంత ప్రయత్నించినా ఇక అఖిల్ నిలబడటం కష్టం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: