టాలీవుడ్ లో తన కామెడీ మార్క్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు హీరోగా తనదైన మార్క్ చాటుతున్నాడు. కుటుంబ కథా నేపథ్యంలో వస్తున్నా శ్రీనివాస్ రెడ్డి తాజాగా ‘జంబలకిడిపంబ’సినిమాలో నటిస్తున్నాడు. ఒకప్పుడు ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో సీనియర్ నరేష్ నటించిన జంబలకిడిపంబ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆడవారు మగవారిగా..మగవారు ఆడవారిగా మారితే ఎలా ఉంటుంతో అన్న కాన్సెప్ట్ తో దర్శకుడి వెరైటీ కామెడీతో తెలుగు ప్రేక్షకులకు మరుపురాని సినిమా అందించారు.