ఈ మద్య టాలీవుడ్ లో తక్కువ బడ్జెట్ తో కొత్త దర్శకులు సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్నారు.  పెద్ద సినిమాలు సైతం చేయని కలెక్షన్లు చిన్న సినిమాలు సాధిస్తున్నాయి.  ఆ మద్య తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమా ఎంత గొప్ప హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ఇదే విజయ్ దేవరకొండ తో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీశారు..ఆ సినిమా సెన్సేషన్ హిట్ అయ్యింది.  దాంతో నిర్మాతలు సైతం చిన్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 


తాజాగా పెళ్లి చూపులు ఫేం తరుణ్‌భాస్కర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. కొత్త కాన్సెప్ట్‌తో పెళ్లి చూపులు తీసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు తరుణ్‌భాస్కర్. ఈ యువ దర్శకుడు మరోసారి యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు. కథ గురించి ఎలాంటి క్లూ లేదు.. కానీ ఏదో డిఫరెంట్ సినిమాను చూపిస్తాం.. అన్నట్టుగా ట్రైలర్‌ను కట్ చేశారు ‘ఈ నగరానికి ఏమైంది’రూపకర్తలు.


థియేటర్లలో సినిమాకు వెళ్లగానే మొదటగా పలకరించే మాట.. ‘ఈ నగరానికి ఏమైంది?’అనేది. సిగరెట్ స్మోకింగ్ వద్దని చెప్పే థియేటరికల్ హెచ్చరిక నుంచి టైటిల్ లాగడమే చాలా క్యాచీ. ఇవి చాలు యూత్‌లో, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఆసక్తి కలగడానికి, ఓవర్సీస్‌లో హైప్ రావడానికి. ఇలాంటి నేపథ్యంతో, యూత్‌ను మరింతగా ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తో ఉంది ‘ఈ నగరాని కి ఏమైంది’ ట్రైలర్.

Ee Nagaraniki Emaindi trailer unveiled

విడుదల అయిన కొన్ని గంటల్లోనే భారీ ఎత్తున వ్యూస్‌ను పొందింది ఈ ట్రైలర్. షార్ట్ ఫిలిం తీయాలనుకునే నలుగురు యువకుల (స్నేహితులు)చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్, వెంకటేశ్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందిసున్నాడు. తరుణ్ నయా సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: