మహేష్ తన బావ సుధీర్ బాబు సినిమాల ఫంక్షన్స్ కు ఎప్పుడు పిలిచినా వస్తూ తనకు చేతనైన స్థాయిలో సుధీర్ బాబును ప్రమోట్ చేయడానికి అన్నివిధాల ప్రయత్నిస్తున్నాడు. అయితే మహేష్ అభిమానులు మాత్రం ఇంకా సుధీర్ బాబును పూర్తిగా అంగీకరించకపోవడంతో ఈ హీరో సినిమాలకు చెప్పుకోతగ్గ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం లేదు. 
నా పనిలో నేను బిజీగా
ఇలాంటి పరిస్థుతులలో నిన్న మహేష్ అతిధిగా వచ్చిన ‘సమ్మోహనం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ ఫంక్షన్ లో సుధీర్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా గురించి తనకు ఉన్న భయం అంతా ఈ ఫంక్షన్ లో మహేష్ ను చూడగానే భయం పోయింది అంటూ ఉద్వేగంగా ఉపన్యసిస్తూ మధ్యలో ఎమోషనల్ అయి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపివేసాడు. 
అక్కడ ఇరగ్గొట్టేస్తాడు, కానీ
ఈ సంఘటనను చూసిన మహేష్ సుధీర్ బాబు వద్దకు వచ్చి ప్రోత్సహిస్తూ సుధీర్ తన ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు తన ఉపన్యాసాలతో అదరగోడతాడని కానీ తన సినిమాల ఫంక్షన్స్ లో మాత్రం ఎమోషనల్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటాడని జోక్ చేసాడు. అంతేకాదు ఈసినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం తనకు ఉందీ అంటూ ఈమూవీ పై అంచనాలు పెంచడానికి ప్రయత్నించాడు మహేష్.  
నాకు బాగా నచ్చిన చిత్రం
ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం పాజిటివ్ టాక్ వినిపిస్తున్న ఈమూవీ పై పెద్దగా చెప్పుకోతగ్గ అంచనాలు లేకపోయినా ఈమూవీతో పోటీగా విడుదలయ్యే పెద్ద సినిమాలు ఏమి లేని నేపధ్యంలో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ‘సమ్మోహనం’ హిట్ మూవీగా మారే ఆస్కారం ఉంది. ఒక సినిమా తార జీవితం చుట్టూ తిరిగే ఈ ప్రేమ కథలో ఫిలిం ఇండస్ట్రీ పై అదేవిధంగా మీడియా పై కొన్ని ఘాటైన సెటైర్లు ఉంటాయి అన్న ప్రచారం జరుగుతోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: