ఈ మద్య బాలీవుడ్ లో స్టార్ హీరోల కొడుకులే కాదు కూతుళ్లు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు.  రణదీర్ కపూర్ కూతుళ్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనీల్ కపూర్ కూతురు సోనం కపూర్ కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందారు.  ప్రస్తుతం సయీఫ్ అలీఖాన్ కూతురు సరా అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. 
Related image
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ముద్దుల కూతరు సుహానా ఖాన్ త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.  ప్రస్తుతం సుహానా లండన్ లో చదువుకుంటుంది. తాజాగా షారుఖ్‌ గారాల పట్టి సుహానా ఖాన్‌, భార్య గౌరీ ఖాన్‌  సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు. కూతురితో కలిసి లండన్‌లో దిగిన ఫోటోలను గౌరీ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. జీన్స్‌, టీ షర్ట్స్‌లో గౌరీ, సిల్వర్‌ కలర్‌ డ్రెస్‌లో సుహానా ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

కాలేజీ చివరిరోజులు కావడంతో లండన్‌ మొత్తం చుట్టేస్తోంది. కాగా గౌరీ పెట్టిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.సుహానా త్వరలోనే బాలీవుడ్‌కు పరిచయం కానుందని తెలుస్తోంది. సుహానాకు సామాజిక మాధ్యమాల్లో  మంచి క్రేజ్‌ ఉంది. చదువు పూర్తి కావడంతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో సుహానా ఖాన్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: