సూపర్ స్టార్ రజినికాంత్, పా. రంజిత్ కాంబినేషన్ లో కబాలి తర్వాత వెంటనే వచ్చిన సినిమా కాలా. ధనుష్ నిర్మించిన ఈ సినిమా తమిళనాడులో రజినికాంత్ క్రేజ్ దృష్ట్యా హిట్ కొట్టొచ్చేమో కాని తెలుగులో మాత్రం మళ్లీ కబాలి రోజులను గుర్తుచేస్తుంది. ఇంకా చెప్పాలంటే భారీ హైప్ తో వచ్చింది కాబట్టి కబాలి అయినా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. కాలా మాత్రం ఓపెనింగ్స్ లో కూడా పేలవమైన ప్రదర్శన చూపించింది.


27 కోట్ల తెలుగు బిజినెస్ చేసిన కాలా 4 డేస్ కలక్షన్స్ గా కేవలం 6.41 కోట్లనే వసూళు చేయడం విశేషం. సూపర్ స్టార్ రజినికాంత్ మేనియా ఏమైనట్టో అర్ధం కావట్లేదు. కబాలితో లెక్క తప్పింది కదా అది సరిచేసుకుంటాడేమో అనుకుంటే రంజిత్ మళ్లీ కబాలిలానే కాలాతో నిరాశపరచాడు.


ఓ ప్రాంతంలోని నాయకుడు ఆ ప్రాంతంలోని ప్రజలను కాపాడటానికి ఏం చేశాడన్న కథతో కాలా వచ్చింది. ఇది పాత కథే అయితే కొత్తగా చెప్పాలనుకున్న దర్శకుడి ఆలోచన బాగుంది కాని కథనం ల్యాగ్ అయ్యే సరికి కంటెంట్ గురి తప్పింది. అక్కడ ఉంది రజినికాంత్ ఆయన్ను ఎలా వాడుకుంటే సినిమా అంత రేంజ్ కు వెళ్తుంది. ఆ విషయంలో రెండు సినిమాల్లో ఫెయిల్ అయ్యాడు పా. రంజిత్.


స్టార్ సినిమాలకు ఎమోషన్స్ అనేవి ఉన్నా అవి పరిధి మేరకే ఉండాలి. వాళ్ల నుండి ఫ్యాన్స్ ఆశించేది భారీ ఫైట్స్, స్టైలిష్ యాక్టింగ్ అలా కాకుండా ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ రాస్తే ఎలా చెప్పండి. కాలా తెలుగు వసూళ్లు చాలా పేలవంగా ఉన్నాయి. 4 రోజుల్లో 6 కోట్లు అంటే సినిమా ఇక్కడ మళ్లీ భారీ లాసులే తెచ్చేలా ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: