తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ 2 సీజన్ నిన్నటి నుంచి మొదలైంది.  ఎంతో అట్టహాసంగా ప్రారంభం అయిన బిగ్ బాస్ 2 లో మొత్తం 16 మందిలో 13 మంది టీవీ, సినిమా రంగాలకు సంబంధించిన సెలబ్రిటీలు కాగా.. ముగ్గురు సామాన్యుల్ని బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్‌కి పోటీదారులుగా ఎంపికచేశారు. ఇందులో ఓ మహిళా కంటెస్టెంట్ ఉండటం విశేషమైతే ఈ ముగ్గురూ విజయవాడకు చెందిన వారే కావడం మరో విశేషం. మహిళా కామన్ ఉమెన్ కేటగిరీలో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంజనా అన్నే గత ఎపిసోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మోడలింగ్‌లో రాణిస్తూ.. మిస్ హైదరాబాద్‌ ఎంపికైనా సంజనా ప్రోమోలో బాగా ఆకట్టుకుంది.  ఈ సందర్భంగా నాని వేసిన ప్రశ్నలకు చక చకా సమాధానాలు చెబుతూ..తాను తనలాగే ఉంటానని..ఎవరికీ హాని కలిగించే పనులు చేయనని అన్నారు. అంతే కాదు నాని ఒక సామాన్యుడిలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి..ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు..అని నానికే కౌంటర్ వేసింది. 

ఆకర్షించే అందం.. ఆకర్షణీయమైన రూపంతో సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు తాను రెడీ అన్నట్లు తొలి ఎపిసోడ్‌లోనే గ్లామర్ టచ్ ఇచ్చింది సంజనా. అంతేకాదు బిగ్‌బాస్ హౌస్‌లో రక్తి కట్టించే అన్ని అంశాలు తనలో పుష్కలంగా ఉన్నట్లుగా ఇండికేషన్స్ ఇచ్చేసింది. ఇదిలా ఉంటే.. తొలిరోజే తమకు సంజనా నుండి ముప్పు తప్పేలా లేదని భావించిన సెలబ్రిటీ కంటెస్టెంట్ ఈమెను హౌస్ నుండి బయటకు పంపేందుకు మూకుమ్మడిగా ఆమెనే నామినేట్ చేశారు.
Image result for big boss 2 telugus model sanjana
అయితే ఇంత మంది సెలబ్రిటీలు ఉంటే.. సామాన్యులుగా వచ్చిన మమ్మల్నే ఎందుకు హౌస్ నుండి బయటకు పంపేందుకు నామినేట్ చేస్తున్నారంటూ ఎదురు ప్రశ్నించడాన్ని బట్టి బిగ్ బాస్ హౌస్‌లో సంజనా అన్నే స్పీడ్‌ను సెలబ్రిటీలు తట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: