నాచురల్ స్టార్ నాని స్వతహాగా హీరోగా ఎదిగిన వారిలో ఈమధ్య కాలంలో అందరికి స్పూర్తిగా నిలుస్తున్న హీరో. కెరియర్ లో ఎన్ని ఫ్లాపులొచ్చినా తన నాచురల్ యాక్టింగ్ తో ఇప్పుడు నాచురల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న హీరో మన నాని. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నానికి ఈమధ్య ఓ పెద్ద సమస్య వచ్చి పడ్డది. 


కాస్టింగ్ కౌచ్ మీద ఫైట్ చేసిన శ్రీరెడ్డి అది వదిలేసి ఇండస్ట్రీలో పెద్ద వాళ్లని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. కొన్నాళ్లుగా హడావిడి చేసిన ఆమె పవన్ పై కామెంట్స్ చేయడంతో ఆ తాకిడికి కాస్త వెనక్కి తగ్గింది. ఇక ఇప్పుడు మళ్లీ శ్రీరెడ్డి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంతో హీరోలను టార్గెట్ చేస్తుంది.


మరి చెప్పాలంటే మూడు నాలుగు రోజుల నుండి నాని మీద శ్రీరెడ్డి రకరకాల కామెంట్స్ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. నాని+శ్రీరెడ్డి=డర్టీ పిక్చర్ అంటూ ఆమె కామెంట్స్ అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇక దీనిపై అమ్మడి వ్యవహారం శృతిమించడంతో నాని స్పందించాడు. ఓపికకు ఓ లెక్కుంటుందని చెప్పి తన మీద లీగల్ యాక్షన్ కు సిద్ధమవుతున్నట్టు ప్రకటించాడు నాని.


నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కొందరు వ్యక్తులు చేస్తున్న కామెంట్స్ కు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్టు చెప్పాడు నాని. ఆ కామెంట్స్ వల్ల తనకేం బాధ లేదని కాని మన అందరి కోసం తాను ఇలా చేస్తున్నానని.. సమాజానికి హానికరమైన వారి అంతు తేలుస్తా అన్నట్టు మెసేజ్ పెట్టాడు నాని. ఓ పక్క నానితో నా సరసాలు ఈ యాంగిల్ అంటే నానికి ఇష్టం అని శ్రీరెడ్డి అంటుంటే.. ఇవన్ని ట్రాష్ అంటూ నాని లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు సిద్ధపడటం మళ్లీ శ్రీరెడ్డి మీద అందరి దృష్టి పడేలా చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: