నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్-2 మొదలైంది. మొదటిరోజు పరిచయ కార్యక్రమంతోనే ముగియగా కంటెస్టంట్స్ ఒక్కరోజులో కొన్ని తేడాలు గమనించడం జరిగింది. ఈసారి 16 మంది కంటెస్టంట్స్ లో ముగ్గురు కామన్ మెన్ కావడంతో కొద్దిగా చేంజ్ కనబడుతుంది. మిగతా వారంతా ఎలాగోలా సినిమాకు సంబందించిన వారే కాని ఈ ముగ్గురు బాబు గోనినేనితో కలిపి నలుగురు కాస్త కొత్తగా అనిపిస్తున్నారు.


ఇక ఈ సీజన్ అనుకున్నంత గ్రాండ్ గా అయితే స్టార్ట్ అవలేదు. ఒక్కరోజు ఏదో అలా వచ్చి ఇలా వెళ్లాడు నాని. ఎన్.టి.ఆర్ అంత జోష్ ఫుల్ గా యాంకరింగ్ చేయలేదు అన్నది అందరు అనుకుంటున్న మాటే. ఇక ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఎంట్రీ ఇవ్వనుందట.


మొదటి సీజన్ లో వైల్డ్ కార్డ్ గా నవదీప్, దీక్షా పంథ్ లు ఎంట్రీ ఇచ్చారు. దీక్షా కొంతమేర హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే ఈసారి తన ప్లేస్ లో ఓ హీరోయిన్ నే సెట్ చేశారు స్టార్ మా వాళ్లు. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ అని తెలుస్తుంది.  


కంచెతో తెలుగులో లైం లైట్ లోకి వచ్చిన ప్రగ్యా సినిమాలైతే చేస్తుంది కాని సరైన క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఇక ఛాన్స్ ఇస్తే ఎలాంటి పాత్రలకైనా సిద్ధమే అన్నట్టుగా ఈమధ్య హాట్ నెస్ పెంచింది. రీసెంట్ గా జిక్యూ మేగజైన్ కోసం ఇచ్చిన స్టిల్స్ అయితే కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రగ్యా జైశ్వాల్ ను ఈసారి వైల్డ్ కార్డ్ గా పంపించే అవకాశం ఉందట. లీడింగ్ టాలీవుడ్ హీరోయింగ్ బిగ్ బాస్ హౌజ్ లో అంటే షోకి కొంత కలరింగ్ వచ్చేసినట్టే. 



మరింత సమాచారం తెలుసుకోండి: