సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి లైంగికంగా లోబరచుకొని సినిమాలో ఒక చిన్న పాత్రకూడా ఇవ్వకుండా మహిళలను  మోసం చేస్తున్న ఇండస్ట్రీలోని కామాంధుల భరతం పట్టడానికి ఇన్నాళ్లు ఒక పోరాటాన్ని చేసింది శ్రీ రెడ్డి. ఇన్నాళ్లు సజావుగా  సాగిన ఆమె పోరాటం ఒక్కసారిగా పవన్ కల్యాణ్ ను విమర్శించడంతో మొత్తం నీరుగారిపోయింది. 


తన అనుకున్నవాళ్ళు సైతం ఆమెకు వ్యతిరేకం అవడంతో ఇప్పటితో తన పోరాటానికి సెలవు  పెట్టింది. అంతమాత్రాన పవన్ ను విమర్శించడం మాత్రం మానలేదు. తాజాగా ఫేస్బుక్లో స్పందిస్తూ.. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్, ఇండస్ట్రీలో ఉన్న తమలాంటి వాళ్లకు కూడా నిరుద్యోగ భృతి కల్పించాలని లేకపోతే పనయినా ఇప్పించాలని కోరింది.


అంతేగాక మెగా ఫ్యామిలీ గురించి మళ్ళీ సంచలన వాఖ్యలు చేసింది. అది దోపిడీ దొరల కుటుంబం అని తెలిపింది. ముందు నీ కుటుంబం తెలుసుకొని ఆ తరువాత సీఎం పదవి గురించి ఆలోచించమని పవన్ కు హితబోధ బోధచేసింది. మెగా ఫ్యామిలీలో  హీరోల నుండి కాస్ట్యూమ్ డిజైనర్ల వరకు పదమూడు నుండి పదిహేను వరకు ఉంటారని తెలిపిన ఆమె, ఆ కుటుంబ ఆదాయం చూస్తే ఆశ్చర్యపోతారని రాసుకొచ్చింది. ఇతర కొత్త హీరోలను ఎదగనివ్వకుండా మెగా ఫ్యామిలీ తొక్కేస్తుందని ఆరోపించింది. అల్లుఅరవింద్ ఇండస్ట్రీ డబ్బులన్నీ జనసేన పార్టీ అకౌంట్లోకి వేస్తున్నారని ఆరోపించింది. జనసేన పార్టీ అంతా మెగా ఫ్యామిలీ కుట్ర అని ఆరోపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: