నిన్నరాత్రి జరిగిన కళ్యాణ్ రామ్ రొమాంటిక్ మూవీ 'నా నువ్వే' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిథిగా వచ్చిన జూనియర్ కళ్యాణ్ రామ్ టెన్షన్ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  కొత్త దర్శకుడు  జయేంద్ర దర్శ‌క‌త్వంలో రూపొంది ఈవారం విడుదల కాబోతున్న ఈసినిమా గురించి జూనియర్  మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ భయాలు బయట పెట్టాడు.   
ఇవన్నీ నటుడికి సర్వసాధారణం
తాను తన కెరియర్ లో పడిన టెన్షన్ ను ఇప్పుడు కళ్యాణ్ రామ్ పడుతున్నాడని తాను ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను చేస్తూ ఒక డిఫరెంట్ గెటప్ లోకి మారినప్పుడు తనను అభిమానులు ఆదరిస్తారా అన్న టెన్షన్ పడ్డానని ఇప్పుడు కొత్త లుక్ తో ప్రయోగాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ కూడ తనలాగే టెన్షన్ పడుతున్నాడని కామెంట్స్ చేసాడు. అయితే ప్రతి నటుడికి ఒక స్టీరియో టైప్ సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే ఆ నటుడికి సంతృప్తి ఉండదు అని అంటూ ప్రయోగాలు చేయకుంటే ఇండస్ట్రీలో హీరోగా నిలబడటం కష్టం అని కామెంట్స్ చేసాడు జూనియర్.  
అలా చేస్తే సంతృప్తి ఉండదు
ఇదే సందర్భంలో జూనియర్ మాట్లాడుతూ తన అన్నయ్య టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటూ అభిమానులది, ప్రేక్షకులది చాలా పెద్ద హృదయం జున్యూన్ గా కష్టపడితే వారు ఆదరించి తీరుతారు అంటూ ‘నా నువ్వే’ గ్యారంటీ సక్సస్ అని కామెంట్ చేసాడు.  ఈ చిత్రం రిలీజైన తర్వాత ఈసినిమా గురించి అందరు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అంటూ ఈమూవీ పై అంచనాలు పెంచడానికి ప్రయత్నించాడు జూనియర్. 
యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే సందేహం ఉండేది
కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేసిన నేపధ్యంలో ఈమూవీలో తమన్నాతో లవ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అయితే యూత్ ఇప్పటి పరిస్థుతులలో కళ్యాణ్ రామ్ రొమాంటిక్ యాంగిల్ ను అంగీకరిస్తారా అని జరుగుతున్న ప్రచారానికి టెన్షన్ పడుతున్న కళ్యాణ్ రామ్ భయాలను ఓపెన్ గానే జూనియర్ బయటపెట్టినట్లు అయింది. అయితే ఈమధ్య కాలంలో మళ్ళీ కళ్యాణ్ రామ్ ను వరస పరాజయాలు పలకరిస్తున్న పరిస్థుతులలో కళ్యాణ్ రామ్ టెన్షన్ కు జూనియర్ ఇచ్చిన ధైర్యం ఎంత వరకు విజయాన్ని ఇస్తుందో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: