చాల ఘనంగా ప్రారంభం అయిన ‘బిగ్ బాస్ 2’ షో మొదటిరోజునే ఆషోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు రేగింది. సెలెబ్రెటీలు సామాన్యులు అన్న విధంగా ఈకార్యక్రమంలో పాల్గొంటున్న 16 మంది మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి ఎవరికీ వారే మరొకరి ఎలిమినేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. ఇలాంటి పరిస్థుతులలో ‘బిగ్ బాస్’ అడిగిన వెంటనే ఈకార్యక్రమంలో పాల్గొంటున్న సెలెబ్రెటీలు అంతా ఒక మాట పై ఎకమై ఇద్దరు సామాన్యులను జైలుకు పంపడం నిన్నటి షోకు హైలెట్ గా మారింది. 
దోమలు, బొద్దింకలు, ఎలుకల మధ్య గడిపిన...సంజన, నూతన్
ఈషోలోని సెలెబ్రెటీలు ఇచ్చిన షాక్ తో సామాన్యుల కేటగిరీలో ఈషోకు వచ్చిన సంజన నూతన్ నాయుడు బలయ్యారు. ‘బిగ్ బాస్’ ఇంట్లో ఆరుబయట ఏర్పాటు చేయబడిన జైల్లో రాత్రంతా నూతన్ నాయుడు, సంజన ఆ జైల్లో గడపడంతో పాటు దోమలు ఈగల మధ్య వారుపడ్డ ఇబ్బంది నిన్నటి కార్యక్రమంలో ప్రధాన అంశం. జైల్లో ఉన్న తమపై జాలి చూపేందుకు వచ్చిన సెలబ్రిటీలతో సంజన వాదనకు దిగడంతో తిరిగి సామాన్యులు సెలెబ్రెటీల మధ్య భేదాభిప్రాయాలు స్పష్టంగా కనిపించాయి. 
ఎవరినీ ఇంప్రెస్ చేయడానికి రాలేదన్న నూతన్
ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ సూచన మేరకు సెలెబ్రెటీలు జైల్లో ఉన్న ఇద్దరు సామాన్యుల్లో ఒకరిని బయటకు తెచ్చే విషయంలో కూడ మొదటిరోజునే సెలెబ్రెటీల మధ్య ఏర్పడిన గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ‘బిగ్ బాస్’ తన ఇంటి సభ్యులకు కొన్ని లెటర్స్ పంపిన నేపధ్యంలో కౌశల్‌కు జైలు ఫ్రీ కార్డు వచ్చింది. 
జైలు ఫ్రీ కార్డు ఒకసారి మాత్రమే వాడుకునే అవకాశం ఉన్న నేపధ్యంలో దీన్ని సంజనను జైలు నుండి బయటకు తీసుకురావడానికి వాడుతావా? నీ కోసం దాచుకుంటావా? అని బిగ్ బాస్ అడిగినప్పుడు కౌశల్ ఆకార్డు తన కోసమే దాచుకుంటాను అంటూ చెప్పి తనలోని స్వార్ధ గుణాన్ని అనుకోకుండా బయట పెట్టాడు.
మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలు
ఇది ఇలా ఉండగా ‘బిగ్ బాస్’ షో నుండి అప్పుడే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. ‘బిగ్ బాస్’ ఇంటి సభ్యుల నుండి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఎక్కువ ఓట్లు పడిన సునైన, గణేష్, కిరీటి, కౌశల్, నూతన్, సంజన ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. వీరిలో ఎక్కువమంది సామాన్యులే అవ్వడం ఇక్కడి ట్విస్ట్. అయితే ఈషోను చూస్తున్న ప్రేక్షకులు వేసే ఓట్ల బట్టి ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి ఈ వారంతంలో ఎవరు ఈషో నుండి ఎలిమినేట్ అవుతారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..  


మరింత సమాచారం తెలుసుకోండి: